యస్5 స్పోర్ట్‌బ్యాక్ కారును విడుదల చేసిన ఆడి ఇండియా: ధర, ఫీచర్లు
జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారి సంస్థ అయిన ఆడి ఇండియాలో తన యస్5 స్పోర్ట్‌బ్యాక్ కారును విడుదల చేసింది. దీని ధర దాదాపుగా 62.96 లక్షలు ఎక్స్-షోరూమ్, (ఢిల్లీ) గా ఉంది. ఈ నాలుగు డోర్లున్న ఆడి కారు మంచి అమ్మకాలను సాధిస్తుందని కంపెని వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలకు: లండన్‌లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్ కారు: డిసి అవంతి
ఆడి యస్5 స్పోర్ట్‌బ్యాక్ కారుకు చెందిన మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి..

ఆడి మోడల్స్ :
ఆడి తన యస్5 స్పోర్ట్‌బ్యాక్‌ను అతి త్వరగా ఇండియాలో ప్రవేశ పెట్టాలని ఆలోచించింది అయితే కొన్ని అనివార్య కారణాల వలన విడుదలలో కొంచెం జాప్యం చేసుకుంది. ఆడి ఈ మధ్యనే విడుదల చేసిన కొన్ని కొత్త మోడల్స్ క్యూ3, ఆర్‌యస్7, ఆర్‌యస్6 అవంత్, టిటి కూపె మరియు ఎ6 మ్యాట్రిక్స్ వంటి కార్లను విడుదల చేసింది

ఇంజన్ :
ఆడి యస్5 స్పోర్ట్‌బ్యాక్ లో 3.0-లీటర్, వి6 టియఫ్‌యస్ఐ టర్బోఛార్జ్‌డ్ మరియు డైరెక్ట్ ఇంజక్షన్ ఇంజన్ కలదు. ఇది మీకు 328బిహెచ్‌పి మరియు 440ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ :
ఆడి యస్5 స్పోర్ట్‌బ్యాక్‌లో 7-స్పీడ్ యస్-ట్రోనిక్ డియస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు ఇది కారులో నాలుగు చక్రాలకు పవర్‌ని సరఫరా చేస్తుంది.

భద్రత :
భద్రత పరంగా ఇందులో మంచి ఫీచర్లు ఉన్నాయి.
- ఎనిమిది ఎయిర్ బ్యాగ్‌లు కలవు
- ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ వితి బ్రేక్ అసిస్ట్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ అసిస్ట్ గల యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- టాండెమ్ బ్రేక్ బూస్టర్
- ముందు మరియు వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కలవు.
- అమ్మకాలకు సిద్దమైన రేంజ్ రోవర్ స్పోర్ట్ యస్.వి.ఆర్ : ధర, ఫీచర్స్..
- 2015 సంవత్సరానికి 15 మోడల్స్‌ను విడుదల చేసిన మెర్సిడెస్-బెంజ్.
- రెండు కొత్త కార్లను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ:మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డిజైన్ :
చాలా మంది వీటి డిజైన్‌ల కోసమే కొంటారు. దీని ఫ్రంట్ గ్రిల్ ఎంతో సాంప్రదాయకరమైన ఆకృతిలో ఉంటుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో ముందు వైపున ఉన్న బంపర్ పూర్తిగా క్రోమ్‌తో తయారు చేశారు.

పోటి :
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో దీనిని ఏ ఇతర కార్లకు పోటిగా విడుదల చేయలేదని చెప్పరు. అయితే జర్మనీ దిగ్గజ లగ్జరీ కార్ల తయారి సంస్థ ఆడి త్వరలో కొన్ని కార్లను మెర్సిడెస్-బెంజ్‌కు పోటిగా భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.



Click it and Unblock the Notifications








