ఆటో ఎక్స్‌పో 2016 తేదీలు వెల్లడి
ఆటో ఎక్స్‌పో 2016 తేదీలు వెల్లడయ్యాయి. గడచిన సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో 2014 తర్వాత వస్తున్న 13వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పో 2016 కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ఈ అంతర్జాతీయ ఆటో షోకి కేవలం మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో, నిర్వాహకులు రిజిస్ట్రేషన్లు, వేదిక ఏర్పాట్లను చేస్తున్నారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ భారత ఆటోమొబైల్ ఫెస్టివల్ 'ఆటో ఎక్స్‌పో' వచ్చే ఏడాది (2016) ఫిబ్రవరి 5వ తేది నుంచి ప్రారంభమై 9వ తేదీ వరకు జరగనుంది. ఎప్పటి మాదిరిగానే వచ్చే ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేయనుంది.

గడచిన సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆటో ఎక్స్‌పో రెండు వేదికలలో (గ్రేటర్ నోయిడా, న్యూఢిల్లీ) జరగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో మెయిన్ 2016 ఆటో ఎక్స్‌పో నిర్వహిస్తారు (అన్ని కార్ల విడుదలలు ఇక్కడే జరుగుతాయి).
ఇకపోతే విడిభాగాలకు సంబంధించిన ఆటో ఎక్స్‌పోను ఇదివరకు నిర్వహించినట్లుగానే న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తారు. కార్లకు సంబంధించిన ఆటో ఎక్స్‌పో గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5 నుంచి 9, 2016వ తేది వరకు జరుగుతుంది (ఫిబ్రవరి 5, 6 తేదీలు కేవలం ప్రెస్‌ను మాత్రమే అనుమతిస్తారు, సాధారణ ప్రజలను ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు అనుమతిస్తారు).
ప్రగతి మైదాన్‌లోని కాంపోనెంట్ షోను ఫిబ్రవరి 4 నుంచి 7వ తేది వరకు నిర్వహిస్తారు. కాగా.. 2016 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








