ఈ దీపావలి కోసం ఉత్తమ ఆఫర్లను ప్రకటించిన కార్లు
భారతీయులు గర్వంగా జరుపుకునే పండుగ దీపావళి. మరియు పండుగ సీజన్ మొదలైంది అంటే అది దీపావళితోనే అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు జరిగేది ఈ పండుగ ద్వారానే. ప్రతి ఏడాదిలాగే ఏడాది కూడా కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను పోటి పడి అమ్ముకునేందుకు వారి వివిధ మోడళ్ల మీద రకరకాల ఆఫర్‌లను ప్రకటించాయి.
Also Read: ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు ప్రతి కూలతలు: నిపుణుల మాటల్లో...
ఈ ఏడాదిలో అతి తక్కువ అమ్మకాలు నమోదు చేసుకున్న మోడళ్లను కూడా ఈ దీపావళి సీజన్‌లో జరిగే అమ్మకాలతో కవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పండుగ సంధర్బంలో కొత్తవి కొనడం ద్వారా మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఎక్కువ మంది కొత్తవి కొనడానికి ప్రయత్నిస్తారు దీని వలన కంపెనీలు అనేక డిస్కౌంట్లను ప్రకటించడం ద్వారా చాలా ఉత్పత్తులు అమ్మడుపోతున్నాయి.
Also Read: పండుగ సీజన్‌లో కారు కొనాలనుకుంటున్నారా ? ఉత్తమైన కార్లు మరియ వాటి ఫీచర్లు
2015 నవంబర్‌లో ఈ దీపావలి సీజన్‌లో వివిధ కార్ల మీద ఉన్న ఆఫర్లను క్రింది కథనాల ద్వారా తెలుకుందాం రండి....

ఫియట్ పుంటో :
ఫియట్ కంపెనీ తన పుంటో మోడల్ హ్యాచ్ బ్యాక్ మీద దాదాపుగా రూ. 70,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో 30,000 వరకు క్యాష్ బ్యాక్‌ను, 25,000 రుపాయల వరకు ఎక్స్‌చ్ఛేంజి బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ క్రింద 5,000 రుపాయలు మరియు ప్రస్తుతం ఫియట్ యాజమానులకు లోటల్టీ స్కీమ్ క్రింద 10,000 రుపాయల వరకు ఆఫర్‌లను ప్రకటించింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
సౌత్ కొరియాకు చెందిన కార్ల తయారీదారులు హ్యుందాయ్ మోటర్స్ తమ హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 లో అన్ని వేరియంట్ల మీద ఈ ఆఫర్‌లను ప్రకటించింది. 40,000 రుపాయల వరకు ఎక్స్‌చ్చేంజ్, 22,000 రుపాయల విలువ చేసే ఉచిత ఇన్సూరెన్స్ మరియు రూ. 8,000 వరకు క్యాష్ ప్రకటించింది. ఇవన్ని కలిపి 70,000 రుపాయల వరకు లభిస్తాయని తెలిపారు.

షెవర్లే బీట్ :
షెవర్లే బీట్ లో గల అన్ని పెట్రోల్ మరియు డీదల్ వేరియంట్ల మీద దాదాపుగా రూ. 60,000 రుపాయల వరకు డిస్కౌంట్లు మరియు సేవింగ్స్‌ను ప్రకటించాయి. అందులో 40,000 రుపాయల వరకు సేవింగ్స్ మరియు రూ. 20,000 రుపాయల వరకు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ పొందే అవకాశం ఉందని తెలిపారు.

టాటా నానో :
మీరు టాటా మోటార్స్ కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు రూ. 2,000 రుపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఒక వేళ అలా ఉద్యోగం చేయకపోతే రూ. 15,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం మరియు రూ. 20,000 రుపాయల వరకు ఎక్స్‌చ్చేంజ్ లాభాలు పొందవచ్చు. అంటే టాటా మోటార్స్ నానో వాహనాల మీద దాదాపుగా మొత్తం రూ. 37,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు. అయితే నానో జెన్‌యక్స్ ఎయమ్‌టి మోడల్ మీద ఈ ఆఫర్‌లు ప్రకటించలేదు దయచేసి గమనించండి.

రెనొ డస్టర్ :
రెనొ డస్టర్‌లో ఎంపిక చేసుకునే వేరియంట్ ఆధారంగా దాదాపుగా 1.2 లక్షల వరకు ఆఫర్‌లను ప్రకటించింది.

టాటా సఫారి స్ట్రోమ్
టాటా మోటార్స్ తన సఫారీ స్ట్రోమ్ మోడల్ యస్‌యువి మీద ఈ దీపావలికి ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ డిస్కౌంట్ రెండు కలిపి దాదాపుగా 37,000 ఆఫర్‌ను ప్రకటించింది.

ఫియట్ అవెంచుర
ఫియట్ అవెంచురా దాదాపుగా రూ. 80,000 రుపాయల వరకు ఆఫర్‌లను ప్రకటించింది. ఈ మొత్తం ఆఫర్‌లో కార్పోరేట్, ఎక్స్‌చ్చేంజ్ బోనస్, మరియు లోయల్టీ బోనస్ వంటి అన్నింటి మీద ప్రకటించినట్లు తెలిపారు.

మారుతి సుజుకి యస్-క్రాస్
మారుతి సుజుకి తన నెక్సా షోరూమ్‌లో అందుబాటులో ఉంచిన ఈ యస్-క్రాస్ మోడల్ మీద 90,000 రుపాయల వరకు ఆఫర్‌లను ప్రకటించింది. అందులో 40,000 రుపాయల వరకు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు 50,000 రుపాయల వరకు క్యాష్ డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ ఆఫర్ ఎంపిక చేసుకునే వేరియంట్ల ఆధారంగా అందివ్వనున్నారు.

టాటా జెస్ట్
టాటా మోటార్స తన జెస్ట్ మోడల్ కారు మీద ఎక్స్‌చ్చేంజ్ బోనస్, క్యాష్ బ్యాక్ ఆఫర్‌ల మీద మొత్తం రూ. 47,000 వరకు అందివ్వనున్నారు మరియు ఎంచుకునే కంపెనీని బట్టి వినియోగదారులకు 2,000 రుపాయల వరకు ఆఫర్ ప్రకటించారు.

ఫియట్ లీనియా
ఫియట్ మోటార్స్ లోయల్టీ బోనస్‌గా రూ. 15,000, ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్ క్రింద 30,000 రుపాయలు మరియు కార్పోరేట్ డిస్కౌంట్ క్రింద 5,000 రుపాయలను ఆఫర్‌గా ప్రకటించారు. అంటే ఈ ఫియట్ లీనియా మీద దాదాపుగా 60,.000 రుపాయల వరకు ఆఫర్‌లు ఉన్నాయి. అయితే ఫియట్ లీనియా క్లాసిక్ మోడల్ మీద ఎటువంటి ఆఫర్లు లేవన్నారు.

హ్యుందాయ్ వెర్నా
మీకు హ్యుందాయ్ వెర్నా కారు ఉందా? అయితే ఈ దీపావళికి మీరు మీ కారును ఎక్స్‌చ్ఛేంజ్ చేసుకుంటే కారు యొక్క మొత్తం ధరలో దాదాపుగా 50,000 రుపాయల వరకు ఎక్స్‌చ్చేంజి ఆఫర్‌ను పొందుతారు. మరియు క్యాష్ డిస్కౌంట్స్ మీద 20,000 రుపాయల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అంటే దాదాపుగా రూ. 70,000 వరకు ఆఫర్‌లను ప్రకటించింది.

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్
మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ అన్ని వేరియంట్ల మీద దాదాపుగా ఆరు లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది.

మెర్సిడెంజ్-బెంజ్ సి-క్లాస్
మెర్సిడెస్-బెంజ్ తన సి-క్లాస్ మోడళ్ల మీద రెండు లక్షల వరకు ఆఫర్లను ప్రకటించారు.

బియమ్‌డబ్ల్యూ 3 సిరీస్ మోడల్
బియమ్‌డబ్ల్యూ కు చెందిన 3 సిరీస్ కారు మీద కంపెనీ దాదాపుగా ఎనిమిది లక్షల వరకు ఆఫర్‌లను ప్రకటించింది.

బియమ్‌డబ్ల్యూ 5 సిరీస్ మోడల్
బియమ్‌డబ్ల్యూ సంస్థ తన మరొక లగ్జరీ కారు అయిన 5 సిరీస్ కారును ఈ దీపావలికి ఐదు లక్షల వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించారు. అయితే ఆ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే ఉంటుందని తెలిపారు.

ఆడి ఎ4
ఆడి కంపెనీ తనఅన్ని ఏ4 వేరియంట్ల మీద స్టాక్ ఉన్నంత వరకు ఏడు లక్షల వరకు క్యాష్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

తీర్పు
అన్ని సెగ్మెట్లలో వివిధ రకాల కంపెనీలు వారు అందిస్తున్న ఆఫర్‌లను అందిచాము. ఇందులో అతి తక్కువ ధర గల కార్ల నుండి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల వరకు ప్రకటించిన ఆఫర్‌లను అందిచాము. ఈ పండుగ సీజన్‌లో మంచి కారును ఎంచుకునేందుకు ఇది ఎంతాగనో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.

- నవరాత్రి ఆఫర్లను పొడిగించిన హ్యుందాయ్ మోటార్స్
- మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.


Click it and Unblock the Notifications








