సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 యుటిలిటి వాహనాలు

By Anil

ఈ సంవత్సరం చివరి త్రైమాసకంలో కొన్ని కొత్త వాహనాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని కంపెనీలు చాలా మంది వినియోగదారుల మనస్సు దోచుకున్నాయి. యుటిలిటి వాహనాలు కూడా అదే దారిలోనే నిలిచాయి. దీనికి పెద్ద ఉదాహరణ ఏదంటే హ్యుందాయ్ క్రెటా ఎన్నో కంపెనీల వాహనాలు మార్కెట్లో ఉన్నప్పటికీ క్రెటా తనకంటూ ఒక ప్రతేత స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇప్పుడు ఈ అతి పెద్ద వాహన సంస్థ పడుతున్న సమస్య ఏమిటంటే అంతర్జాతీయ డిమాండ్‌ను తీర్చలేక పోతోంది.

Also Read: మీ సిటిలో మీకు నచ్చిన కారు యొక్క ధరలను తెలుసుకోండి.

మహీంద్ర టియువి300 మోడల్ యుటిలిటి వెహికవల్ కూడా నిన్న కాక మొన్న వచ్చి తనేంటో నిరూపించుకుంది. ఈ సెప్టెంబర్ 2015న జరిగిన అమ్మకాలను గత ఏడాది ఇదే నెలతో పోల్చడం జరిగింది. అయితే ఏ వెహికల్ ముందు ఉందో ?మరియు వాటికి సంభంధించిన ధర, ఇతర విషయాలను తెలుసుకుందా? అయితే క్రింద ఉన్న స్లైడ్ల మీద ఓ లుక్కేయండి...
గమనిక అన్ని ధరలు ఆన్-రోడ్(హైదరాబాద్),(దాదాపుగా).

10.టయోటా ఫర్చూనర్ :

10.టయోటా ఫర్చూనర్ :

ఈ శ్రేణిలో అత్యంత ఖరీదైన వాహనం ఇదే. ఇది ఇప్పుడు పదవ స్థానంలో ఉంది. 2015 సెప్టెంబర్ నెలలో 1,089 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే నెల గత ఏడాదిన 1,745 ఫర్చూనర్ వాహనాలు అమ్ముడుపోయాయి. అయితే అప్పుడు ఇప్పుడు రెండుసార్లు కూడా 10 వ స్థానంలో నిలిచింది.

ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధర రూ. 27,29,724

09. మారుతి సుజుకి ఎర్టిగా :

09. మారుతి సుజుకి ఎర్టిగా :

మారుతి సుజుకి ఎర్టిగా గత ఏడాది అమ్మకాలు 5,672 ఉండగా, ప్రస్తుతం వీటి అమ్మకాలు 2,641 పడిపోయాయి అధేవిదంగా క్రితం సంవత్సరం నాలుగవ స్థానంలో ఉన్న ఇది ప్రస్తుతం 9 వ స్థానానికి వచ్చింది.

దీని ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధర: పెట్రోల్ ధర రూ. 7,43,810.డీజల్ వేరియంట్ ధర రూ. 9,05,406

08.మహీంద్ర యక్స్‌యువి500 :

08.మహీంద్ర యక్స్‌యువి500 :

మహీంద్ర యక్స్‌యువి500 గత ఏడాది కూడా ఇదే స్థానంలో ఉంది. ప్రస్తుత సెప్టెంబర్‌లో వీటి అమ్మకాలు 3,110 యూనిట్లు ఉండగా గత ఏడాది ఇదే నెలలో వీటి అమ్మకాలు 3,035 గా ఉన్నాయి.

ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధర రూ.

07.ఫోర్డ్ ఎకోస్పోర్ట్ :

07.ఫోర్డ్ ఎకోస్పోర్ట్ :

గత ఏడాది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క సెప్టెంబర్ అమ్మకాలు 4,515 యూనిట్లగా నమోదు చేసుకుని ఆరవ స్థానంలో ఉండగా. ప్రస్తుతం వీటి అమ్మగాలు గత నెలలో 3,121 యూనిట్లు అమ్ముడుపోయి ఇప్పుడు ఏడవ స్థానంలో ఉంది.

ప్రారంభ వేరియంట్స్ యొక్క ఆన్-రోడ్ ధర: పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7,66,900 మరియు డీజల్ వేరియంట్ యొక్క ప్రారంభ ధర రూ. 8,82,855 లుగా ఉంది.

06.మారుతి సుజుకి యస్-క్రాస్ :

06.మారుతి సుజుకి యస్-క్రాస్ :

కొత్తగా వచ్చిన మారుతి సుజుకి యస్-క్రాస్ ఆరవ స్థానాన్ని ఆక్రమించింది. ఇవి కేవలం నెక్సా షోరూమ్‌ల నుండి మాత్రమే అమ్మబడుతున్నాయి. సెప్టెంబర్ 2015 న వీటి అమ్మకాలు 3,603 యూనిట్లుగా నమోదైంది.

ప్రారంభ వేరియంట్స్ యొక్క ఆన్-రోడ్ ధర: డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 10,14,626.

05.మహీంద్ర స్కార్పియో :

05.మహీంద్ర స్కార్పియో :

మహీంద్ర స్కార్పియో గత ఏడాది సెప్టెంబర్ నెలలో 6,030 యూనిట్ల అమ్మకాలు జరిపి రెండవ స్థానంలో ఉండేది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 4,313 యూనిట్లను అమ్మి ఐదవ స్థానంలో నిలిచింది.

ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధర: డీజల్ వేరియంట్ యొక్క ప్రారంభ ధర రూ. 10,09,724

04. మహీంద్ర టియువి300 :

04. మహీంద్ర టియువి300 :

ఈ మధ్యనే కొత్తగా విడుదలైన మహీంద్ర టియువి300 యస్‌యువి వాహనము విడుదలైన అతి కొద్ది కాలంలోనే మంచి అమ్మకాలను సాధించింది. ఇప్పటికే 4,321 యూనిట్లను అమ్మి నాలుగవ స్థానంలో నిలిచింది.

ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధర: డీజల్ వేరియంట్ యొక్క ప్రారంభ ధర రూ. 8,26,278.

03.టయోటా ఇన్నోవా :

03.టయోటా ఇన్నోవా :

టయోటా ఇన్నోవా గత ఏడాది సెప్టెంబర్ నెలలో 5,430 యూనిట్ల అమ్మకాలు సాధించగా, ప్రస్తుత సెప్టెంబర్ 2015 న ఏకంగా 5,876 యూనిట్లను అమ్మింది.

టయోటా ఇన్నోవా డీజల్ వేరియంట్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 14,95,678

02.మహీంద్ర బొలెరొ :

02.మహీంద్ర బొలెరొ :

ఇండియాలో బాగా అమ్ముడవుతున్న యుటిలిటి వెహికల్స్‌లో మహీంద్ర బొలెరొ ఒకటి ఎందుకంటే సెప్టెంబర్ 2014 లో ఏకంగా 8,541 వాహనాలు అమ్ముడుపోయాయి మరియు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 5,585 యూనిట్లు అమ్ముడుపోయాయని తెలిపారు.

మహీంద్ర బొలెరొ ప్రారంభ వేరియంట్ యొక్క ధర రూ. 7,21,917

01.హ్యుందాయ్ క్రెటా

01.హ్యుందాయ్ క్రెటా

చెప్పాలంటే అతి ఉత్తమమైన యస్‌యువి లలో ముందున్న మోడల్ హ్యుందాయ్ క్రెటా. ఎందుకంటే విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఊహించని రికార్డులను నెలకొల్పింది. ఈ హ్యుందాయ్ క్రెటా యస్‌యువి వెహికల్ ఏకంగా 7,256 యూనిట్ల అమ్మకాల మైలు రాయిని చేధించాయి.

ధరలు: పెట్రోల్ బేస్ వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధర రూ. 9.98 లక్షలు మరియు డీజల్ బేస్ వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధర రూ. 11.13 లక్షలు

వీటిని కూడా చదవండి...

వీటిని కూడా చదవండి...

  • సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు. మరి అందులో మీ కారు ఉందా?-ఇక్కడ క్లిక్ చేయండి

  • పండుగ సీజన్‌లో కారు కొనాలనుకుంటున్నారా ? ఉత్తమైన కార్లు మరియు వాటి ఫీచర్లు మీకోసం-క్లిక్ చేయండి
  • సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మరి ఇందులో మీ బైక్ ఉందా?-దీని మీద ఓ కన్నేయండి

More from DriveSpark

Article Published On: Monday, October 26, 2015, 19:14 [IST]
English summary
The last quarter of this year has seen a few new vehicle launches. Some of these automobiles immediately became a hit among customers, while some are yet to please the buyers. The same is the case with the Utility Vehicle segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+