భారత్‌లో బ్లావ్‌పంక్ట్ ఆండ్రాయిడ్ కేప్ టౌన్ 940 సిస్టమ్ విడుదల
కార్ ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ సౌండ్ సిస్టమ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'బ్లావ్‌పంక్ట్' భారత్‌లో మరో సరికొత్త ఆడియో సిస్టమ్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే 'కేప్ టౌన్ 940 సిస్టమ్'ను కంపెనీ భారత్‌కు పరిచయం చేసింది.
బ్లావ్‌పంక్ట్ కేప్ టౌన్ 940 సిస్టమ్ 6.8 ఇంచ్ కెపాసిటివ్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్‌ని కలిగి ఉండి, 4.1 జెల్లీ బీన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఏ ఇతర కంపెనీ ఆఫర్ చేయని ఫీచర్లను ఇందులో ఆఫర్ చేస్తున్నామని బ్లావ్‌పంక్ట్ తెలిపింది.

బ్లావ్‌పంక్ట్ కేప్ టౌన్ 940 ఫీచర్లు:
- ట్విన్ బ్లూటూత్ కనెక్టివిటీ
- ఇంటర్నెట్ కనెక్టివిటీ
- వైఫై కనెక్టివిటీ, వైఫై హాట్‌స్పాట్
- స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్
- ఆండ్రాయిడ్ మ్యూజిక్ ప్లేయర్
- అప్లికేషన్ (యాప్) స్టోర్
- మిర్రర్ మోడ్ ఫీచర్
- ఫైవ్-బ్యాండ్ పారామెట్రిక్ ఈక్వలైజర్
- మూడు యూఎస్‌బి పోర్టులు
- ఆక్సలరీ (ఆక్స్-ఇన్) కేబుల్ సపోర్ట్
- 8 జిబి ఇంటర్నల్ మెమరీ
- 1 జిబ ర్యామ్
భారత్‌లో బ్లావ్‌పంక్ట్ కేప్ టౌన్ 940 సిస్టమ్ ధర రూ.54,990గా ఉంది. దీనికి అధనంగా రూ.3,900 చెల్లించినట్లయితే, మ్యాప్ మై ఇండియా నావిగేషన్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








