మీ కారుకు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ కావాలా.. అయితే ఇదిగో..

By Ravi

కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ల తయారీలో ప్రసిద్ధి చెందిన బ్లావ్‌పంక్ట్, భారత్‌లోని కార్ల కోసం ఓ సరికొత్త టైర్ ప్రెజర్ మోనిటరింగ్ (టిపిఎమ్ఎస్) సిస్టమ్‌ను పరిచయం చేసింది. సాధారణంగా, విలాసవంతమైన కార్లలో ఈ ఫీచర్ స్టాండర్డ్‌గా లభిస్తుంటుంది. కానీ బేసిక్ కార్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.

ఈ నేపథ్యంలో, బేసిక్ కార్లలో సైతం టైర్ ప్రెజర్‌ను ఆటోమేటిక్‌గా పర్యవేక్షించేందుకు వీలుగా బ్లావ్‌పంక్ట్ ఈ సరికొత్త సిస్టమ్‌ను పరిచయం చేసింది. బ్లావ్‌పంక్ట్ టిపిఎమ్ఎస్ కిట్‌లో ఓ డిజిటల్ డిస్‌ప్లే యూనిట్ మరియు నాలుగు వైర్‌లెస్ సెన్సార్లు ఉంటాయి. ఈ నాలుగు సెన్సార్లను నాలుగు టైర్ వాల్వ్‌లకు క్యాప్‌ల మాదిరిగా అమర్చుకోవాలి.

Blaupunkt Launches Tyre Pressure Monitoring System In India

ఈ సెన్సార్లను దొంగలు అపహరించడానికి వీలు లేకుండా ఉంచేందుకు, ఇందుకోసం ఓ ప్రత్యేకమైన లాకింగ్ మెకానిజం‌ను డిజైన్ చేశారు. ఈ వైర్‌లెస్ సెన్సార్లు టైరులోని గాలి పీడనాన్ని, ఉష్ణోగ్రతను చెక్ చేసి, కారు లోపల ఉండే డిజిటల్ డిస్‌ప్లేపై ప్రొజెక్ట్ చేస్తాయి. ఈ సిస్టమ్ వలన టైరులో గాలి తగ్గడాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.

బ్లావ్‌పంక్ట్ టిపిఎమ్ఎస్ వలన మీ కారుకు సంబంధించి ఏ టైరులో ఎంత మోతాదులో గాలి ఉందో తెలుసుకోవటం కూడా చాలా సులువు అవుతుంది. అంతేకాకుండా.. ఈ సిస్టమ్ వలన టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు సులువుగా చెక్ చేసుకుంటూ తద్వారా టైర్లపై పడే అదనపు భారాన్ని తగ్గించడం ద్వారా టైరు జీవితకాలాన్ని కూడా పెంచుకోవటంలో ఈ సిస్టమ్ సహకరిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 13, 2015, 14:40 [IST]
English summary
Car infotainment manufacturer Blaupunkt has launched its TPMS (Tyre Pressure Management System) kit in India. The Blaupunkt TPMS provides real time information and alerts about the tyre pressure and temperature conditions, thereby reducing the risk of punctures, or accidents caused by tyres.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+