ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విఐపిల కోసం బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ వాహనాలు
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో విఐపిల మూవ్‌మెంట్ కోసం జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తమ వాహనాలను అందించనుంది. భారతదేశంలోని దాదాపు చాలా మంది విఐపిలు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లను కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో, విఐపిలకు బిఎమ్‌డబ్ల్యూ తమ విలాసవంతమైన ట్రీట్‌మెంట్‌ను అందించేందుకు ఈ డీల్ కుదుర్చుకుంది.
ఈ డీల్ ద్వారా విఐపిలకు బిఎమ్‌డబ్ల్యూ విలాసవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, తమ లగ్జరీ వాహనాలను కూడా ప్రమోట్ చేయనుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే ధనికులను, విఐపిలను తమ వాహనాలతో ఆకర్షిచడం ద్వారా కొత్త వినియోగదారులను తమ ఖాలాతోలకి చేర్చుకోవాలని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా భావిస్తోంది.

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసే విఐపిల కోసం బిఎమ్‌డబ్ల్యూ గ్రాన్ తురిస్మో వాహనాలను అందించనుంది. ఈ వాహనాల్లో విఐపిలను వారి లాంజ్ నుంచి ప్రైవేట్ జెట్‌లు, చార్టెడ్ ఫ్లైట్‌ల వరకూ రైడ్ ఆఫర్ చేయనుంది.

పెర్ఫార్మెన్స్‌కి, స్పేసియస్ ఇంటీరియర్‌కి బిఎమ్‌డబ్ల్యూ గ్రాన్ తురిస్మో కార్లు పెట్టింది పేరు. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ గ్రాన్ తురిస్మో కారు ధర రూ.44.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇందులో 1995సీసీ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 19.59 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








