రెండు కొత్త కార్లను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారి సంస్థ ఇండియాలోకి రెండు సరికొత్త లగ్జరీ కార్లను విడుదల చేసింది. అవి ఎక్స్ 5ఎమ్ మరియు ఎక్స్6ఎమ్. అయితే ఇవి రెండు బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ రేంజ్ నుండి రావడం విశేషం ఎందుకంటే ఇప్పకే ఎమ్ రేంజ్ నుండి ఆరు మోడళ్లను కంపెని మార్కట్లోకి విడుదల చేసింది.
Also Read: యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం
బిఎమ్‌డబ్ల్యూ ఇలా ఉన్నఫలంగా రెండు లగ్జరి కార్లను విడుదల చేసిన విషయం చూస్తే ఇది కూడా భారతదేశంలో ఉన్న పండుగ సీజన్ కోసం ముందస్తుగా విడుదల చేసిందని చెప్పవచ్చు.
Also Read: లండన్‌లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్స్ కారు: డిసి అవంతి దీని గురించి మరింత చదవండి
బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ఎక్స్5ఎమ్, ఎక్స్6ఎమ్ లకు సంభందించిన ధర, ఇంజన్, స్పెసిఫికేషన్స్ వంటి పూర్తి సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

ఎమ్ బ్రాండ్‌లో గల రకరకాల మోడల్స్ :
ఈ రెండు కార్లతో కలిపి జర్మనీ కార్ల తయారి సంస్థ అయిన బిఎమ్‌డబ్ల్యూకి ఎమ్ రేంజ్ నుండి మొత్తం ఆరు మోడల్స్ ఉన్నాయి. అవి ఎమ్3,ఎమ్4,ఎమ్5, ఎమ్6 గ్రాన్ కూపే మరియు ఇప్పుడు వచ్చిన రెండు కార్లు ఎక్స్5ఎమ్ మరియు ఎక్స్6ఎమ్. ఒక విధంగా చెప్పాలంటే బిఎమ్‌డబ్ల్యూకి ఈ ఎమ్ సిరీస్ బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అందుకే కాబోలు ఎక్కువగా వీటినే విడుదల చేస్తోంది.

M-స్టుడియో :
బిఎమ్‌డబ్ల్యూ తమ ఎమ్ వెర్షన్‌లో ఉన్న అన్ని హై ఫర్మామెన్స్ కార్లను ఎమ్-స్టుడియో ద్వారా వాటిని స్పోర్టివ్‌గా రూపొందిస్తారు. ఇలాంటి ఎమ్-స్టుడియోని బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే ముంబైలో ప్రారంబించింది. మరియు ఇందులో ఎమ్ సిరీస్ కార్లను మాత్రమే విక్రయిస్తారు. త్వరలో దీనిని మరిన్ని నగరాలకు విస్తరించే ఆలోచనలో కంపెనీ ఉంది.

ఇంజన్ వివరాలు :
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ మరియు ఎక్స్6ఎమ్ రెండు కార్లలో కూడా 4.4-లీటర్, ట్విన్ టుర్బో, వి8 పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 575 హార్స్‌పవర్ మరియు 750 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

ట్రాన్స్‌మిషన్ :
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ మరియు ఎక్స్6ఎమ్ రెండు కార్లలో కూడా 8-స్పీడ్ ఎమ్ స్టెప్‌ట్రోనికి గేర్ బాక్స్ కలదు మరియు, ఇది నాలుగు చక్రాలకు డ్రైవ్‌ను ఇస్తుంది.

గరిష్ఠ వేగం :
కేవలం 4.2 సెకండ్లలో ఈ రెండు కార్లు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. మిరియు వీటి గరిష్ఠ వేగం గంటకు 250 కిలోమీటర్లు దీనిని పూర్తిగా విద్యుచ్ఛక్తితో నియంత్రించవచ్చు. ఇవి విడుదల చేసే పవర్ ఎమ్5 మరియు ఎమ్6 గ్రాన్ కూపే కార్లు విడుదల చేసే పవర్‌కు సమానంగా ఉంటుంది.

సాంకేతిక :
క్యాబిన్‌లో స్థిరమైన ఉష్ణోగ్రతను ఉంచడానికి , ఆటోమేటిక్ హెడ్ లైట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక సాంకేతిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

ధర :
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ ధర రూ. 1.55 కోట్లు
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6ఎమ్ ధర రూ. 1.60 కోట్లు
రెండు ధరలు ఎక్స్- షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

విడుదల సమంలో జరిగిన రైడ్ విషయాలు :
ఈ రెండు కార్లు అతి చక్కని పని తీరు తనబర్చాయి. ఇందులో డ్రైవింగ్ మోడ్స్ మీ ప్రయాణాన్ని ఎంతో సులభం చేస్తాయి. ఇది చాలా సౌకర్యవంతంగా మరియు విలాసంగా కూడా ఉంది. దీని లోపల ఉన్న క్యాబిన్ యొక్క స్థిర ఉష్ణోగ్రతను కలిగించే సిస్టమ్ ఎంతో బాగుంది. కాని దీని పరంగా చూస్తే ఎక్కువే మరి.


Click it and Unblock the Notifications








