కార్లపై భారీ రాయితీ ; సంవత్సరాంతపు ఆఫర్లను మిస్ కావద్దండి మరి!

By Anil

మరో నెల కాల గర్భంలో కలిసిపోయింది. ప్రతి మాసం లాగే ఈ మాసం కూడా కార్ల మీద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకు వచ్చింది. నెలారంభం మాత్రమే కాదు సంవత్సరాంతం కావడం వలన చాలా వాహన సంస్థలు తమ వాహనాలను అమ్ముకునేందుకు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాయి.
మరింత తెలుసుకోండి: మీ నగరంలో మీకు నచ్చిన కార్ల ధరలను తెలుసుకోండి.

మంచి అవకాశం మించిన దొరకదు అన్న నానుడి వినే ఉంటారు కదా. క్రిస్మస్ అని, నెలారంభం అని, సంవత్సరాంతం అని ఎన్నో ఆఫర్లను చాలా కంపెనీలు ప్రకటించాయి. వాటిని డ్రైవ్ స్పార్క్ మీ కోసం క్రింది కథనాల ద్వారా అందింస్తోంది. మరెందుకు ఆలస్యం ఏ కార్లు ఏ ఆఫర్లను కలిగి ఉన్నాయో తెలుసుకుని ఒక మంచి కారును సెలెక్ట్ చేసుకుంటే మంచిది కదా...

 హ్యాచ్‌బ్యాక్స్:

హ్యాచ్‌బ్యాక్స్:

18.టాటా బోల్ట్:

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టాటా బోల్ట్ ఎంతో చక్కగా ఉంటుంది. ఇందులో విశాలమైన క్యాబిన్ స్పేస్, ఆధునికమైన ఫీచర్లు మరియు మంచి డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. టాటా వారు దీని మీద 20,000 వరకు క్యాష్ డిష్కౌంట్ మరియు 40,000 రుపాయల వరకు ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించారు. అంటే మొత్తం రూ. 60,000 ల వరకు లాభం పొందవచ్చు.

 17. హ్యుందాయ్ ఐ10 :

17. హ్యుందాయ్ ఐ10 :

హ్యుందాయ్ వారి ఐ10 కారు మీద ఆకర్షణీయమైన16,000 రుపాయలు విలువ చేసే ఉచిత భీమాను అందిస్తోంది మరియు రూ. 14,000 ల వరకు లాభాలు పొందే అవకాశం కల్పింస్తోంది. ఒక వేళ మీరు కనుక మీ పాత కారును ఎక్స్‌చ్ఛేంజ్ చేసుకోవాలనుకుంటే అదనంగా 20,000 రుపాయల వరకు లాభాలు పొందే అవకాశం కలదు. ఐ10 కొనండి దాదాపుగా 50,000 రుపాయల వరకు డిస్కౌంట్ పొందండి.

16. ఫోర్ట్ పిగో :

16. ఫోర్ట్ పిగో :

ఈ సరి కొత్త ఫోర్డ్ ఫిగో కారులో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. ఫోర్డ్ వారు తమ ఫిగో హ్యాచ్ బ్యాక్ ‌కారు మీద ఉచిత ఇన్సూరెన్స్ మరియు ఎక్స‌చ్ఛేంజ్ ఆఫర్ల క్రింద దాదాపుగా 25,000 రుపాయల వరకు ఆఫర్లు అందిస్తున్నారు.

 15. హోండా బ్రియో:

15. హోండా బ్రియో:

హోండా డీలర్లు ఈ బ్రియో హ్యాచ్‌బ్యాక్ కారును కొనబోయే వారికి అతి ఉత్తమమైన ఆఫర్లను ప్రకటించారు. ఇందులో గల వేరియంట్ ఆదారంగా దాదాపుగా 20,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు.

ఎస్‌యువి:

ఎస్‌యువి:

14. మారుతు సుజుకి యస్-క్రాస్:

యస్-కార్లను కొనే వారికి నెక్సా షోరూమ్ వారు ఎక్స్‌చ్చేంజ్ మరియు లోయల్టి బోనస్‌ల క్రింద దాదాపుగా 30,000 రుపాయల వరకు లాభాలను అందిస్తున్నారు.

13. వోల్వో ఎక్స్‌సి60 :

13. వోల్వో ఎక్స్‌సి60 :

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ కూడా దేశీయంగా కొన్ని ఆఫర్లను అందించింది. వోల్వో లగ్జరీ యస్‌యువి సెడాన్ అయిన ఎక్స్‌సి60 కారులోని అన్ని వేరియంట్ల మీద దాదాపుగా 6 లక్షల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించారు.

12. ఫోర్ట్ ఎకోస్పోర్ట్:

12. ఫోర్ట్ ఎకోస్పోర్ట్:

ఈ ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కారును కొనే వారికి ఉచిత ఇన్సూరెన్స్ మరియు పాత ఎకోస్పోర్ట్ కార్లను ఎక్స్‌చ్చేంజ్ చేసుకునే వారికి దాదాపుగా 25,000 రుపాయల వరకు లాభాలు ఉన్నాయని తెలిపారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజల్ ఇంజన్ ఆఫ్షన్‌లో అందుబాటులో ఉంది.

11. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5:

11. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5:

జర్మనీకి మరొక దిగ్గజ లగ్జరీ కార్ల సంస్థ అయిన బిఎమ్‌డబ్ల్యూ తన ఎక్స్5 కారును కొనే వారికి దాదాపుగా 6.30 లిక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందే అవకాశం మరియు డీలర్ దగ్గర సరాసరిగా వెళ్లి కొనే వారకి అదనంగా 70,000 రుపాయల వరకు ఆఫర్‌నన ప్రకటించారు. అంటే మొత్తం ఏడు లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయన్నమాట.

 10. టాటా సుమో గోల్డ్ :

10. టాటా సుమో గోల్డ్ :

టాటా సుమో గోల్డ్‌లోని అన్ని వేరియంట్ల మీద రూ. 10,000 వరకు క్యాష్ బ్యాక్‌ను ప్రకటించారు. మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ క్రింద మరొ 15,000 రుపాయలు పొందే అవకాశం కలదు. టాటా వారు మొత్తం 25,000 రుపాయల వరకు ప్రయోజనాలను అందింస్తున్నారు.

సెడాన్ :

సెడాన్ :

09. హోండా అమేజ్:

హోండా మోటార్స్ తమ అమేజ్ కార్లలో గల అన్ని వేరియంట్ల మీద దాదాపుగా 40,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించారు. ఈ హోండా అమేజ్ కారులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లు కలవు

08. మారుతి సియాజ్ :

08. మారుతి సియాజ్ :

మిడ్ సైజ్ సెడాన్‌వలలో అద్భుతమైన లుక్ గల కారు మారుతి సుజుకి సియాజ్. మారుతి సుజుకి ఈ కారు మీద అన్ని రకాలుగా 10,000 రుపాయలు వరకు ఆఫర్‌ను ప్రకటించారు.

07. బిఎమ్‌డబ్ల్యూ-3సిరీస్:

07. బిఎమ్‌డబ్ల్యూ-3సిరీస్:

అత్యంత లగ్జరీ కారును కొనాలనుకునే ఇదే సరైన సమయం. ఎందుకంటే దేశ వ్యాప్తంగా గల అన్ని బిఎమ్‌డబ్ల్యూ డీలర్ అవుట్ లెట్లలో ఈ 3-సిరీస్‌లో గల డీజల్ వేరియంట్ల మీద దాదాపుగా నాలుగు లక్షల రుపాయల వరకు క్యాష్ బ్యాక్‌ను ప్రకటించారు.

06. బిఎమ్‌డబ్ల్యూ-5సిరీస్:

06. బిఎమ్‌డబ్ల్యూ-5సిరీస్:

లగ్జరీ సెడాన్‌లలో 3-సిరీస్ కారు కన్నా పెద్ద కారు 5-సిరీస్ కారు. ఈ 5-సిరీస్ డీజల్ సెడాన్ లోని అన్ని వేరియంట్ల మీద దాదాపుగా ఐదు లక్షల రుపాయల వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించారు.

05. ఆడి ఎ4:

05. ఆడి ఎ4:

జర్మనీకి చెందిన మరొక లగ్జరీ కార్ల సంస్థ ఆడి కూడా సంవత్సారంతపు ఆఫర్లను ప్రకటించింది. తమ ఎ4 లగ్జరీ సెడాన్‌లో గల అన్ని వేరింట్ల మీద నాలుగు లక్షల వరకు లాభాలను ప్రకటించారు. అయితే డీలర్ల దగ్గర స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

04.వోల్వో ఎస్60:

04.వోల్వో ఎస్60:

అత్యంత భధ్రత కలిగిన కారు కావాలనుకునే వారికి వోల్వో ఎస్60 కారు బెస్ట్ అని చెప్పవచ్చు. వోల్వో ఎస్60 లోని అన్ని వేరియంట్ల మీద స్టాక్ ఉన్నంత వరకు దాదాపుగా ఐదు లక్షల వరకు క్యాష్ బ్యాక్‌ను ప్రకటించారు.

03. హ్యుందాయ్ వెర్నా:

03. హ్యుందాయ్ వెర్నా:

హ్యుందాయ్ వెర్నా కారు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ కారు మీద హ్యుందాయ్ అన్ని డీలర్ షిప్‌లు దాదాపుగా 25,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో 1.4-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లు కలవు ఇవి రెండు కూడా మ్యాన్యువల్ మరయు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లోల లభ్యమగును.

 02. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్:

02. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్:

మెర్సిడెస్ బెంజ్, ఆడి ఎ4 మరియు బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ కుల పోటిగా తన సి-క్లాస్ కారు మీద మూడు లక్షల రుపాయల వరకు క్యాష్ డిస్కౌంట్‌ను ప్రకటించారు. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు

01.నిస్సాన్ సన్ని:

01.నిస్సాన్ సన్ని:

నిస్సాన్ వారి మిడ్ సైజ్ సెడాన్ అయిన నిస్సాన్ పెట్రోల్ వేరియంట్ మీద దాదాపుగా 75,000 రుపాయలు మరియు డీజల్ వేరియంట్ల మీద 45,000 రుపాయల వరకు ప్రయోజనాలను అందించారు. ఈ రెండు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ కార్లు మ్యాన్యువల్ లేదా సివిటి గేర్ బాక్స్ అప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

కార్లపై భారీ రాయితీ ; సంవత్సరాంతపు ఆఫర్లను మిస్ కావద్దండి మరి!

చాలా కార్లకు చెందిన ఆఫర్లను ఇక్కడ అందించాము కదా, మరి ఈ సంవత్సరాంతపు ఆఫర్లలో ఏ కారును ఎంచుకుంటున్నారు ? ఇవి కాకుండా మరిన్ని కార్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కార్లపై భారీ రాయితీ ; సంవత్సరాంతపు ఆఫర్లను మిస్ కావద్దండి మరి!
  1. ఇండోనేషియాలో విడుదలైన హోండా బిఆర్-వి: అతి త్వరలో భారత్‌లోకి
  2. వచ్చేస్తోంది.... వచ్చేస్తోంది... టాటా వారి సరి కొత్త జికా కారు
  3. ఏం నాయనా బీటిల్ కారు కావాలా?
  4. మహీంద్రా నుండి ఎక్స్‌యువి500 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

More from DriveSpark

Article Published On: Tuesday, December 8, 2015, 11:46 [IST]
English summary
Best Car Discounts For This Year End
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+