మహీంద్రా రేవా సీఈఓ చేతన్ మైనీ రాజీనామా
ఎలక్ట్రిక్ కార్లను దేశానికి పరిచయం చేసిన రేవా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ సీఈఓ చేతన్ మైనీ, ఇప్పుడు తన పదవికి రాజీనామా చేశారు. రేవా కంపెనీని మహీంద్రా స్వాధీనం చేసుకుని, మహీంద్రా రేవాగా పేరు మార్చుకున్న సంగతి తెలిసినదే.
దాదాపు 20 ఏళ్ల క్రితం చేతన్ మైనీ రేవా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి వచ్చిన ఒకేఒక మోడల్ రేవా ఐ. రేవాను మహీంద్రా స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ సంస్థ మహీంద్రా ఈ2ఓ అనే ఎలక్ట్రిక్ కారును విడుదల చేశారు.

మహీంద్రా రేవా కంపెనీకి సీఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న చేతన్ మైనీ హఠాత్తుగా తన పదివికి రాజీనామా చేయటం వెనుక అసలు కారణంగా ఇంకా తెలియరాలేదు. కాగా.. మైనీ స్థానాన్ని మాజీ ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ మాథ్యూ భర్తీ చేయనున్నారు.
చేతన్ మైనీ మహీంద్రా రేవా సీఈఓ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఆ కంపెనీలో మాత్రం షేర్‌హోల్డర్‌గా కొనసాగనున్నారు. కాగా.. మహీంద్రా రేవా కొత్త సీఈఓగా అరవింద్ మాథ్యూ నియామకం మే 1, 2015వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.


Click it and Unblock the Notifications








