కొత్త మార్పులతో 2015 షెవర్లే ఎంజాయ్
షెవర్లే ప్రస్తుతం చాలా రకాల మోడళ్లను భారత్‌లో అందిస్తోంది. ఎక్కువ పోటి ఉన్న మార్కెట్ కోసం ఎప్పటికప్పుడు వాటికి కొన్ని కొత్త మార్పులు చేస్తోంది.
ఈ అమెరికన్ ఆధారిత తయారీ సంస్థ కొత్త మార్పులతో 2015 షెవర్లే ఎంజాయ్ ఎంపీవీని విడుదల చేసింది. దీని గురించిన మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం........

ధర :
2015 షెవర్లే ఎంజాయ్ ధర రూ.6,24,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

2015 షెవర్లే ఎంజాయ్ లోపలి భాగం (ఇంటీరియర్) డిజైన్‌లో ఎక్కువ మార్పులు చేశారు.

1.4-లీటర్ పెట్రోలో లేదా 1.3-లీటర్ డీజల్ ఇంజన్లు అభివృద్ధి చేయబడ్డాయి.

2015 షెవర్లే ఎంజాయ్ బయటి భాగం (ఎక్స్‌టీరియర్) డిజైన్‌లో ఎక్కువ మార్పులు చేయలేదు.

2015 షెవర్లే ఎంజాయ్ ఇంజన్ మరియు పవర్‌లలో ఎటువంటి మార్పులు చేయలేదు.

కస్టమర్ల అవసరాలను బట్టి ఇది 8-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఇందులో మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక ఎలక్ట్రిక్ సాకెట్ ఏర్పాటు చేయబడింది.

ఎక్స్‌టీరియర్ భాగంలో షెవర్లే లోగోతో పాటు మూడు వైపులు కలిగిన గ్రిల్‌ను కలిగి ఉంది.

ఫాగ్ ల్యాంప్స్ ఆకు మాదిరి కన్పించే విధంగా కొత్తగా డిజైన్ చేయబడ్డాయి.

క్యాబిన్ లోపల ఆడియో కంట్రోల్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటితో ఉన్న కొత్త స్టీరింగ్ వీల్ ఏర్పాటు చేయబడింది.


Click it and Unblock the Notifications








