అనుకున్న సమయం కన్నా ముందే రానున్న షెవర్లే స్పిన్!
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు సరికొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయనుందని, అందులో షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కూడా ఉందని మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. మునుపటి షెడ్యూల్ ప్రకారం, షెవర్లే స్పిన్ 2016లో విడుదల కావల్సి ఉంది.
అయితే, భారత్‌లో అంతంత మాత్రంగా ఉన్న తమ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు షెవర్లే తమ స్పిన్ ఎమ్‌పివిని ఈ ఏడాదే మార్కెట్లో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంటే, అనుకున్న సమయం కన్నా ముందుగానే షెవర్లే స్పిన్ ఎమ్‌పివి మార్కెట్లోకి వస్తుందన్నమాట.

ఇకపోతే.. షెవర్లే స్పిన్ ఎమ్‌పివి విషయానికి వస్తే.. ఇదొక 7-సీటర్ ఎమ్‌పివి. ఇది ఈ సగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, హోండా మొబిలియో, త్వరలో రానున్న రెనో లాజీ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. హోండా మొబిలియో ఆర్ఎస్ (స్పోర్టీ వెర్షన్) మాదిరిగా షెవర్లే స్పిన్‌లో కూడా ఓ స్పోర్టీ వెర్షన్ (స్పిన్ యాక్టివ్) అందుబాటులో ఉంది.

షెవర్లే స్పిన్ ఎమ్‌పివిని జిఎమ్ గమ్మా 2 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








