ఫిబ్రవరిలో విడుదల కానున్న హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్!
హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ మిడ్-సైజ్ సెడాన్ వెర్నాలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, ఫిబ్రవరి 16న హ్యుందాయ్ తమ సరికొత్త వెర్నా మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఈ ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ వెర్నా ఇప్పటికే రష్యన్ మార్కెట్లో విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా పేరుతో అమ్ముడుపోతున్న ఈ సెడాన్, రష్యా మార్కెట్లో 'హ్యుందాయ్ సోలారిస్' పేరుతో అమ్ముడవుతోంది.
ఇటీవలే ఎలైట్ ఐ20 మోడల్‌ను విడుదల చేసి మంచి సక్సెస్ మీదున్న హ్యుందాయ్, ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ ప్రీమియం సెడాన్ ఎలాంట్రాలో కూడా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.

హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పాపులర్ ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఇందులో ప్రధానంగా.. రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్, రీస్టయిల్డ్ ఫాగ్ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ట్విన్ హారిజాంటల్ క్రోమ్ గ్రిల్, సన్నటి మరియు వెడల్పాటి ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్ వంటి మార్పులను, అలాగే హెడ్‌లైట్స్ చుట్టూ ఉండే స్టయిలిష్ బాడీ లైన్స్ కూడా ఇందులో కొత్తగా డిజైన్ చేశారు.
వెనుక వైపు డిజైన్‌లో మార్పులు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయి. రియర్ డిజైన్‌లో ప్రధానంగా, ఎల్ఈడి లైట్లతో తయారు చేయబడిన బ్రేక్ ల్యాంప్స్, వెనుక బంపర్‌కు దిగువ భాగంలో అమర్చబడిన రిఫ్లెక్టర్స్, బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, బంపర్ క్రింది భాగంలో బ్లాక్ కలర్ ప్లాస్టిక్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు. ఇంటీరియర్స్‌లో కూడా మార్పులు చేర్పులు ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








