కస్టమ్ మారుతి ఆల్టో కె10 మోడిఫైడ్ స్కెచ్: ఊహకు హద్దే లేదు!
భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు మారుతి ఆల్టో. మధ్య తరగతి ప్రజల కలల కారుగా భారత ఆటోమొబైల్ చరిత్రలో ఓ చెరగని ముద్ర వేసుకున్న బ్రాండ్‌లలో ఆల్టో కూడా ఒకటి. దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, ఇటీవలే తమ ఆల్టో కె10 మోడల్‌లో కూడా కంప్లీట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.
తొలిసారిగా కారు కొనాలనుకునే వారి ప్రథమ ఎంపిక ఆల్టో కారే అని చెప్పొచ్చు. చాలా మంది రేసింగ్ ప్రియులు, కార్ ఔత్సాహికులు ఆల్టో కార్లను తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకుంటూ ఉంటారు. అలాంటి మోడిఫైడ్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే ఈ స్కెచ్.

మా డ్రైవ్‌స్పార్క్ సీనియర్ ఎడిటర్ సంతోష్ రాజ్‌కుమార్ తన ప్రతిభకు పదునుపెట్టి, ఆల్టో కె10 మోడిఫైడ్ స్కెచ్‌ను డిజైన్ చేశాడు. సుమారు 750 కిలోల బరువును మాత్రమే కలిగి ఉండి, 68 బిహెచ్‍పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌తో ఇది మంచి పవర్ టూ వెయిట్ రేషియోని కలిగి ఉంటుంది.
ర్యాలీ కార్ల డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఈ మోడిఫైడ్ స్కెచ్ ఆల్టో కె10 కారును డిజైన్ చేయటం జరిగింది. ఈ కారును ఆల్టో కె10 ఆర్ఎస్ (ర్యాలీ స్పోర్ట్) అని పిలవొచ్చు. రేసింగ్ డిజైన్, కొత్త గ్రిల్, అదనపు లైట్స్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్, బానెట్ ఎయిర్ ఇన్-టేక్, అల్లాయ్ వీల్స్, రేసింగ్ నెంబర్ డీక్యాల్స్ వంటి సింపుల్ బాడీ కిట్‌తో ఈ స్కెచ్ చేయటం జరిగింది.
మరి ఈ మారుతి ఆల్టో కె10 ఆర్ఎస్ స్కెచ్ కాన్సెప్ట్‌పై మీ అభిప్రాయం ఏంటి..?


Click it and Unblock the Notifications








