మెర్సిడెస్ బెంజ్ సూపర్ హై డెక్ కోచ్ బస్సును విడుదల చేసిన డైమ్లర్ ఇండియా
భారతీయ మార్కెట్లో డైమ్లర్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ యస్‌డిహెచ్ 2436 హై డెక్ కోచ్ బస్సును విడుదల చేసింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వీటి అమ్మకాలను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. మరియు డైమ్లర్ వారు ఈ మొదటి బస్సును కెపియన్ ట్రావెల్స్ వారికి అందజేశారు.
Also Read: పార్లమెంటు సాక్షిగా స్వచ్ఛమైన ఉద్గారహిత బస్సును ఆవిష్కరించి మోడి.
ఈ కోచ్‌ను చెన్నైకి సమీపంలోని ఆర్గాడ్యామ్ అనే పారిశ్రామిక వాడలో డైమ్లర్ వారు తయారు చేశారు. ఇది తక్కువ బరువును కలిగి ఉండటానికి బాడి మొత్తం లైట్ వెయిట్ పరికరాలను ఉపయోగించి రూపొందించారు.
Also Read: ఒక్క కారులో 20 మంది ప్రయాణం
ఫీచర్లు:
ఇది ఆక్టివ్ స్టీరింగ్ ఆక్సిల్‌ను కలిగి ఉంది తద్వారా ఎక్కువ మలుపులను ఈ స్టీరింగ్‌ను ఉపయోగించి సునాయాసంగా తిప్పవచ్చు.
మరియు 61 పుష్ బ్యాక్ సీట్లు, అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్, భద్రత కోసం ఇందులో ఇంధన ట్యాంకుని ప్రత్యేకమైన స్థలంలో ఏర్పాటు చేశారు.
Also Read: వోక్స్‌వ్యాగన్ 21 వ శతాబ్ధపు బీటిల్ కారు మార్కెట్లోకి విడుదల: ధరూ. 28.73 లక్షలు
కెపియన్ ట్రావెల్స్:
దక్షిణ భారత దేశంలో గల అతి పెద్ద లగ్జరీ కోచ్ బస్సులను ఆపరేట్ చేస్తున్న సంస్థ కెపియన్ ట్రావెల్స్. దీని ప్రధాన కార్యాలయం తమిళనాడులోన సేలం లో కలదు. దాదాపుగా 330 వరకు అంతర రాష్ట్ర రవాణా బస్సులను నడుపుతున్నారు.



Click it and Unblock the Notifications








