డాట్సన్ గో ప్లస్ టివిసి: ఇదే ఆ కొత్త ట్రెండ్

By Ravi

నిస్సాన్‌కు చెందిన బడ్జెట్ కార్ బ్రాండ్ డాట్సన్, ఈ నెల 15వ తేదీన తమ సరికొత్త గో ప్లస్ (Go+) ఎమ్‌పివిని కేవలం రూ. 3.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. గతంలో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కోసం కంపెనీ తయారు చేసిన నాయ పరంపర (కొత్త ట్రెండ్) అనే కాన్సెప్ట్‌తో సృష్టించిన టివిసి మాదిరిగానే గో ప్లస్ ఎమ్‌పివి కోసం మరో కొత్త టివిసిని తయారు చేశారు.

డాట్సన్ గో ప్లస్ మార్కెటింగ్ కోసం రూపొందించిన ఈ టెలివిజన్ కమర్షియల్‌లో కూడా కంపెనీ మరోసారి మారుతి సుజుకిని టార్గెట్ చేసింది. ఇందులో డాట్సన్ తమ గో ప్లస్ ఎమ్‌పివిని, మారుతి వ్యాగన్ఆర్‌తో కంపేర్ చేసింది. నయా పరంపర (న్యూ ట్రెండ్) అనే థీమ్‌తో ఈ ప్రకటన సాగుతోంది. ఇందులో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మోడల్‌లో ఉండే అన్ని ఫీచర్లను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Xh0WFUh7rz8?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ (1198సీసీ), 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌నే ఈ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 14.5 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుందని కంపెనీ తెలిపింది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ఇది కూడా చదవండి: డాట్సన్ గో ప్లస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ధరలు:

  • డాట్సన్ గో ప్లస్ డి: రూ.3.79 లక్షలు
  • డాట్సన్ గో ప్లస్ డి1: రూ.3.82 లక్షలు
  • డాట్సన్ గో ప్లస్ ఏ: రూ.4.15 లక్షలు
  • డాట్సన్ గో ప్లస్ టి: రూ.4.16 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Monday, January 19, 2015, 8:54 [IST]
English summary
Datsun have introduced a new TVC in India, attempting to change the perspective of Indian car buyers. They smartly used the ‘Nayi Parampara' theme for its MPV commercial. &#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+