పార్కింగ్ ఫీజులతో హడలెత్తిపోతున్న ఢిల్లీ నగర వాసులు...

By Anil

మన దేశ రాజధానిలో వాహనాలు ఎంతో చవక ధరలకు లభిస్తున్నాయి. ఎందుకంటే మిగతా నగరాలతో పోలిస్తే డిల్లీలో ట్యాక్స్‌ రేట్ తగ్గువగా ఉండటం వలన. ఈ కారణంగా ఈ మధ్య కొత్త వాహనాల కొనుగోలు జోరు మరింత పెరింగింది. ఇది కాస్త నగరంలో అనేక కాలుష్యాలకు కారణం అవుతోంది.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు: ఆశ్చర్యగొలిపే నిజాలు...

ఢిల్లీ నగరంలో వాహనాల కాలుష్యాన్ని అరికట్టడానికి డిల్లీ ప్రభుత్వం వాహనాలకు ఒక్క సారి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం ఆరంభించింది. అనగా వెహికల్‌ కొన్న తరువాత రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లాగ వన్ టైమ్ పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీని వలన వాహనాలు కొనడం సులభమే కాని వాటికి వన్ టైమ్ పార్కింగ్ ఫీజు చెల్లించడం మా వల్ల కాదు బాబోయ్ అని ఢిల్లీ నగర వాసులు బెంబేలెత్తిపోత్తున్నారు. ఎందుకు... ఏమైంది.... క్రింది ఫోటో ఫీచర్ ద్వారా తెలుసుకుందాం రండి.

ఒక్క సారి మాత్రమే

ఒక్క సారి మాత్రమే

వెహిల్ కొనే ముందు వన్ టైమ్ పార్కింగ్ ఫీజును ఆయా అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో చిన్న పెద్ద భేదంలేకుండా ప్రతి వాహనానికి కూడా చెల్లించాల్సి ఉంటుంది.

వెహికల్ యొక్క ధర ఆధారంగా

వెహికల్ యొక్క ధర ఆధారంగా

కొన్న వెహికల్ ధర ఆధారంగా ఢిల్లీ రవాణా అధికారులు వాహనాలకు వన్ టైమ్ పార్కింగ్ ఫీజును నిర్ణయించారు. వాణిజ్య వాహనాలు, ఆటోలు మరియు బస్సులు వంటి వాలహనాలకు కూడా ఈ నూతన ఆలోచనను వర్తింపచేస్తున్నారు. వెహికల్ రేంజ్‌ను బట్టి ఎంతెంత వసూలు చేస్తున్నారో తరువాత స్లైడర్ లో తెలుసుకుందాం.

60,000 రుపాయల వరకు

60,000 రుపాయల వరకు

60,000 రుపాయల వరకు గల టూవీలర్లను కొన్నట్లయితే వన్ టైమ్ పార్కింగ్ ఫీజు క్రింద 1000 రుపాయలను చెల్సించాల్సి ఉంటుంది. ఒక వేళ టూ వీలర్ల ధర 60,000 కు మించితే మొత్తం ధరలో 2 శాతం డబ్బును పార్కింగ్ ఫీజును చెల్సించాల్సి ఉంటుంది.

నాలుగు లక్షల రుపాయల వరకు

నాలుగు లక్షల రుపాయల వరకు

ఫోర్ వీలర్లు నాలుగు లక్షల లోపు ధర ఉంటే వారు దాదాపుగా ఎనిమిది వేల రుపాయలు చెల్సించాల్సి ఉంటుంది.

నాలుగు నుండి ఆరు లక్షల వరకు

నాలుగు నుండి ఆరు లక్షల వరకు

నాలుగు నుండి ఆరు లక్షల లోపు ధర ఉన్న వాహనాలు వాటి మొత్తం ధరలో దాదాపుగా నాలుగు శాతాం అంటే 16,000 రుపాయల వరకు వన్ టైమ్ పార్కింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

8 నుండి 12 లక్షల వరకు

8 నుండి 12 లక్షల వరకు

ఎనిమిది నుండి పన్నెండు లక్షల మద్య గల ధర ఉన్న వాహనాలు 48,000 రుపాయలు లేదా వాహనం మొత్తం ధరలో ఆరు శాతాన్ని వన్ టైమ్ పార్కింగ్ ఫీజుగా చెల్సించాల్సి ఉంటుంది.

12 నుండి 20 లక్షల వరకు

12 నుండి 20 లక్షల వరకు

ఒక వేళ 12 నుండి 20 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలకు 96,000 వేల రుపాయలు లేదా కారు మొత్తం ధరలో ఎనిమిది శాతాన్ని వన్ టైమ్ పార్కింగ్ ఫీజుగా ఢిల్లీ రవాణా అధికారులకు ముట్టజెప్పాల్సి ఉంటుంది.

20 నుండి 40 లక్షల వరకు ఉంటే

20 నుండి 40 లక్షల వరకు ఉంటే

20 నుండి 40 లక్షల ధర ఉన్న వాహనాలను కొన్నట్లయితే వారు రెండు లక్షల రుపాయలను లేదా వాహనం మొత్తం ధరలో 10 శాతాన్ని వన్ టైమ్ పార్కింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

40 లక్షలు ఆపైన

40 లక్షలు ఆపైన

లగ్జరీ కార్లు కొనే వారి సంగతలు ఇక నుండి ఈ వన్ టైమ్ పార్కింగ్ ఫీజును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే 40 లక్షల కన్నా ఎక్కువ విలువైన కార్లను కొన్న వారు ఆరు లక్షలు లేదా వాహనం మొత్తం ధరలో 15 శాతాన్ని వన్ టైమ్ పార్కింగ్ ఫీజుగా అధికారులకు చెల్సిచాల్సిం ఉంటుంది.

ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే

ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే

ప్రస్తుతానికి ఢిల్లీలో వాహనాల సంఖ్యను నియంత్రించడానికి ఇలా చేస్తున్నారు. త్వరలో ఇది దేశం మొత్తం మొదలైనా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటివి ప్రారంభించే ఆలోచన లేదులేండి

మరిన్ని ఆశక్తికరమైన విషయాల కోసం.......

ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు ప్రతి కూలతలు: నిపుణుల మాటల్లో...

ఆనంద్ మహీంద్ర గురించి ఆసక్తికరమైన విషయాలు

Article Published On: Saturday, November 7, 2015, 12:34 [IST]
English summary
Official: Cars To Get Costlier In New Delhi With One-Time Parking Fees
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+