డెట్రాయిట్ ఆటో షో ప్రెస్ కిట్‌లను ఈబేలో అమ్మేస్తున్నారు!

By Ravi

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆటో షోలలో ఒకటైన డెట్రాయిట్ ఆటో షో ఈనెల 12వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ అమెరికాలో జరుగనుంది. ఈ డెట్రాయిట్ ఆటో షోని నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షో (ఎన్ఏఐఏఎస్) అని కూడా పిలుస్తారు.

ప్రతి ఆటో షో మాదిరిగానే, ఈ 2015 డెట్రాయిట్ ఆటో షో కూడా అనేక కొత్త కార్ల ఆవిష్కరణలకు, సరికొత్త సాంకేతికతల ప్రదర్శనకు వేదికగా నిలుస్తోంది. ఆటో షోలకు విచ్చేసే మీడియా మిత్రులకు, ప్రముఖులకు కార్ మేకర్లు మీడియా ప్రెస్ కిట్‌లతో స్వాగతం పలుకుతారు.

ఈ మీడియా కిట్‌లలో స్కేల్ మోడళ్లు, పెన్ డ్రైవ్‌లు, బ్యాగ్‌లు మొదలైన వస్తువులు ఉంటాయి. ఎవరు ముందుగా స్టాల్‌కి వెళ్తారో వారికి మాత్రమే ఇవి దక్కుతాయి. కొందరైతే, ప్రత్యేకించి ఈ మీడియా కిట్‌ల కోసమే ఆటో షోలకు వెళ్తుంటారు. ఇలా సేకరించిన అరుదైన వస్తువులను ఇతరులకు కానుకగా ఇస్తుంటారు.

Press Kit

కానీ ఈసారి కాస్తంత వెరైటీగా, డెట్రాయిట్ ఆటో షోలో సేకరించిన మీడియా కిట్‌లను కొందరు ఆన్‌లైన్ వెబ్‍‌సైట్‌లలో విక్రయానికి ఉంచారు. వాస్తవానికి ఈ ప్రెస్ కిట్‌లలో ఉండే వస్తువులు బయటి మార్కెట్లో లభించవు, ఇవి చాలా అరుదుగా లభిస్తాయి కాబట్టే, వీటికి క్రేజ్ ఎక్కువ.

ఈ క్రేజ్‌‍ను క్యాష్ చేసుకోవాలనుకునే కొందరు మాత్రం, వీటి ఈబే ద్వారా వేలానికి పెట్టారు. ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే, వారికే ఈ ప్రోడక్ట్స్ దక్కుతాయి. హోండా తమ పాపులర్ స్పోర్ట్ కార్ ఆక్యురాని ఆవిష్కరించిన సందర్భంగా ఇచ్చిన మీడియా కిట్‌లోని స్కేల్ మోడల్, పెన్ డ్రైవ్ వంటి వాటితో పాటుగా ఇతర వస్తువులను కూడా ఇలా ఆన్‌లైన్ ద్వారా అమ్మేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 14, 2015, 9:27 [IST]
English summary
Brace yourselves for the 2015 North American International Auto Show between January 12-25, 2015, which has officially kicked off in Detroit, Michigan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+