2015 డెట్రాయి ఆటో షో: బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆల్-వీల్ డ్రైవ్ ఖరారు
ఇటీవలే భారత మార్కెట్లో ఎమ్3, ఎమ్4 వంటి పెర్ఫార్మెన్స్ లగ్జరీ సెడాన్లను విడుదల చేసిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ.. ఇప్పుడు తాజాగా ఎమ్5 పెర్ఫార్మెన్స్ కారుపై దృష్టి సారించింది. అమెరికాలో జరుగుతున్న 2015 డెట్రాయిట్ ఆటో షోలో బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త తరం ఎమ్5 ప్లాన్స్ గురించి వివరాలు వెల్లడించింది.
బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ధి చేస్తున్న సరికొత్త ఎమ్5 మరియు భవిష్యత్ ఎమ్ బ్యాడ్జ్ మోడళ్లలో అధునాత ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్ మోడళ్లలో హార్స్ పవర్, టార్క్‌ను పెంచుకుంటూ పోవడాన్ని తాము కొనసాగించినట్లయితే, నెక్స్ట్ జనరేషన్ ఎమ్5 మరియు ఎమ్6 మోడళ్లు కూడా ఎక్కువ పవర్, టార్క్‌తో వస్తాయని కంపెనీ ప్రతినిధి వ్యాన్ మీల్ తెలిపారు.
సాధారణ ఫోర్-వీల్ డ్రైవ్ కార్లలో ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది. దీనిని 50:50 ఫోర్-వీల్ డ్రైవ్ అని కూడా పిలుస్తాయి. కాగా.. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారులో మాత్రం ప్యూర్ 50:50 ఆల్-వీల్ డ్రైవ్‌కి బదులుగా రియర్-బేస్డ్ సెటప్ (వెనుక చక్రాలకు ఎక్కువ శక్తి బదిలీ అయ్యే విధంగా)ను ఏర్పాటు చేయనున్నారు.
కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారును ఓ మంచి ఫన్-టూ డ్రైవ్ పెర్ఫార్మెన్స్ కారుగా మార్చాలనే ఉద్దేశ్యంతో ఈ మార్పు చేయనున్నారు. ఇప్పటికే కంపెనీ అందిస్తున్న ఎమ్ ఎస్‌యూవీలలో ఈ తరహా ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఎమ్5తో పాటుగా ఎమ్6లో కూడా ఈ కొత్త ఆల్-వీల్ డ్రైవ్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇది 2018 నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/5LVk3NYTd7c?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








