మల్టిక్స్ కోసం ఐషర్ మరియు చోళ భాగస్వామ్యం
చోళమండలం ఇన్వెస్టిమెంట్ మరియు ఫైనాన్స్ కంపెని లిమిటెడ్ (చోళ) మరియు ఐషర్ పొలారిస్ ప్రై. లిమిటెడ్ మల్టిక్స్ కొనుగోలుదారులకు ఫైనాన్స్ సదుపాయం కల్పించడానికి ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి.
ఐషర్ పొలారిస్ ప్రై. లిమిటెడ్ భారత మొదటి పర్సనల్ యుటిలిటి వెహికల్ మల్టిక్స్‌ను ఇటీవల విడుదల చేసింది. స్వంత వ్యాపారం చేసుకునే వారికోసం ఇది తయారుచేయబడింది.

చోళ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు ఫైనాన్స్ సులభతరం కానుంది. 3 ఇన్ 1 అడాప్టబిలిటిని అందించడానికి మల్టిక్స్ తయారుచేయబడింది. మల్టిక్స్ 30 నగరాల్లో విడుదలచేయబడింది.
దీని డెలివరీ 2015 ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఒప్పదంతో చోళ మల్టిక్స్‌కు ఫైనాన్షియర్‌గా వ్యవహరించనుంది.
భారతదేశ వ్యాప్తంగా చోళ తన 534 బ్రాంచ్‌లలో మల్టిక్స్ డీలర్‌షిప్‌లను ఆటో రిటైల్ ఫైనాన్స్‌తో పాటు అందుబాటులోకి తేనుంది.
చోళ యొక్క భాగస్వామ్యం ద్వారా మల్టిక్స్ తన లక్ష్యాలను చేరుకోవాలని ఆలోచిస్తోంది.
Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








