పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు; రోడ్ల అభివృద్ధి కోసమే..
కొత్త సంవత్సరంలో ఇంధన ధరలు తగ్గుతాయనుకున్న ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో మాత్రం ఇంధన ధరలను తగ్గడం లేదు. పైపెచ్చు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని మరోసారి పెంచింది.
ఈసారి ఏకంగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకంటింది. కాగా.. ఈ పెంపు వలన పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ అదనపు ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్తగా రోడ్లు నిర్మించేందుకు, ప్రస్తుత రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచేందుకు ఉపయోగించనున్నారు.

తాజాగా.. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో, గడచిన నవంబర్ 2014 నుంచి వరుసగా మూడు సార్లు ఈ సుంకాన్ని పెంచినట్లయింది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా విమానయానానికి ఉపయోగించే ఇంధన ధరలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గించాయి.
స్వదేశీయ విమానయాన సంస్థలకు విక్రయించే ఇంధనాన్ని కిలో లీటరుకు రూ.7,500, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే ఇంధనాన్ని కిలోలీటరుకు రూ.6,907ల చొప్పున తగ్గించారు. ప్రస్తుత మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ మేరకు నిధులను సమకూర్చే దిశలో భాగంగానే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు.


Click it and Unblock the Notifications








