ఫియట్ నుండి అబర్త్ 695 బిపస్టో రికార్డ్ లిమిటెడ్ ఎడిషన్
ఫియట్ కార్ల తయారీ సంస్థ తన అతి చిన్నదైన పరిమాణం గల ఫియట్ అబర్త్ 695 బిపస్టో రికార్డ్ లిమిటెడ్ ఎడిషన్ కారును విడుదల చేసింది. త్వరలో ఇది ప్రపంచ రోడ్ల మీద పరుగులు పెట్టనుంది. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ అబర్త్ కారు లిమిట్ గానే అందుబాటులో ఉండనుంది. అబర్త్ 695 బిపస్టో కార్లు కేవలం 133 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది.
Also Read: కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహస యాత్ర చేస్తున్న బుల్లి కారు.
ఈ ఫియట్ అబర్త్ 695 బిపస్టో రికార్డ్ లో 1.4-లీటర్ మల్టీ -జెట్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 190బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ అుత్యధిక టార్క్‌న ఉత్పత్తి చేస్తుంది. అయితే పవర్ మొత్తాన్ని ఇందులో గల ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ముందు చక్రాలకు అందిస్తుంది.
Also Read: 135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.
ఇకపోతే ఈ ఫియట్ అబర్త్ 695 బిపస్టో రికార్డ్ లిమిటెడ్ ఎడిషన్ కారు కేవలం 5.9 సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మరియు దీని అత్యధిక వేగం గంటకు 230 కిలోమీటర్లు. ఇది కేవలం పసుపు రంగులో మాత్రమే లభించనుంది. దీని ధర 36,610 పౌండ్లుగా నిర్ణయించారు.



Click it and Unblock the Notifications








