అయ్యో.. బుగాటి వేరాన్ కార్లు ఖాలీ అయిపోయాయ్..!
ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు 'బుగాటి వేరాన్' (Bugatti Veyron). అయితే ఇప్పుడు ఈ మోడల్ అమ్మకాలు దాదాపుగా పూర్తయిపోయినట్లు సమాచారం. బుగాటి తమ పాపులర్ వేరాన్ ఉత్పత్తి నిలిపి వేయనుంది. కాగా.. చిట్టచివరి బుగాటి వేరాన్‌ను 2015 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించే అవకాశం ఉంది.
బుగాటి తొలిసారిగా 2005లో తమ వేరాన్ కారును మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇప్పుడు ఈ కారు ఉత్పత్తి తుది దశకు చేరుకుంది. వేరాన్ మోడల్ ఉత్పత్తిని కంపెనీ కేవల 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. సూపర్‌కార్ కంపెనీలు తమ మోడళ్లలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం ఉత్పత్తిని పరిమితం చేస్తుంటారు.

బుగాటి కూడా ఇదే కోవలో తమ వేరాన్ ఉత్పత్తిని కేవలం 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. బుగాటి వేరాన్‌లో నాలుగు రకాల వేరియంట్లు ఉన్నాయి, అవి - 1101 పిఎస్ వేరాన్, 2005 మోడల్ 16.4, వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ మరియు 2008 మోడల్ ఒరిజినల్ వేరాన్ యొక్క రోడ్‌స్టర్ వెర్షన్.
వీటిలో ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కారు 1200 పిఎస్ వేరాన్ సూపర్ స్పోర్ట్. ఇది 2010 మోడల్. ఫాస్టెస్ట్ ఓపెన్‌టాప్ ప్రొడక్షన్ కారు విషయానికి వస్తే, అది వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విటెస్స్. ఇది 2012 మోడల్. కూపే వెర్షన్ వేరాన్ల ఉత్పత్తిని 300 యూనిట్లకు పరిమితం చేశారు కాబట్టి ఈ వెర్షన్ మోడళ్లు అప్పుడే ఖాలీ అయిపోయాయి. ఇక మిగిలినవి 150 యూనిట్లు రోడ్‌స్టర్ వెర్షన్లు. ఈ వేరియంట్ అమ్మకాలు కూడా దాదాపుగా ఖాలీ అయిపోయినట్లు సమాచారం. ఏదేతైనేం.. సూపర్‌కార్ సెగ్మెంట్లో చరిత్ర సృష్టించిన బుగాటి వేరాన్ చివరకు చరిత్రలో కలిసిపోనుంది.


Click it and Unblock the Notifications








