16,444 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లు రీకాల్ : అసలు సమస్య ఏంటి?
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లలో కొన్ని హ్యాండ్లిగ్ సమస్యల వలన ఫోర్ట్ మోటార్స్ 16,444 ఎకోస్పోర్ట్ కార్లను రీకాలు చేసింది. అనగా సమస్యను వెతికి క్లియర్ చేయడానకి. 2013 నవంబర్ నుండి 2014 ఏప్రిల్ వరకు తయారైన ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ యస్‌యువి కార్లలో సమస్య వచ్చినట్లు తెలిసింది.
Also Read: భారతీయ విపణిలోకి సరికొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి కారు.
ఎకోస్పోర్ట్ కార్లలో వెనుకవైపు గల ట్విస్ట్ బీమ్ బోల్ట్‌ను సరగ్గా బిగించకపోవడం వలన అందులో ఉన్న మరిన్ని స్పెసిఫికేషన్ల మీద దీని ప్రభావం పడే అవకాశం ఉంది మరియు దీని వలన పివోట్ బోల్ట్ కూడా విరుగిపోయే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: 2016 ఆటో ఎక్స్‌పో లో మారుతి సుజుకి విటారా చిన్నఎస్‌యువి
ఇప్పటికే ఇలాంటి కార్లను కొన్న వినియోగదారులు దీనికి సంభందించిన సమస్యను ఎదుర్కొన్నట్లయితే దగ్గరలోని ఫోర్డ్ షోరూమ్‌లో సంప్రదించగలరని కంపెని తెలిపింది. లేదంటే ఇతర షాపులలో దీనికి సంభందించిన సర్వీసును చేయించుకున్నట్లయితే దానికి విలువైన డబ్బును కూడా అందివ్వడానికి కంపెనీ మొగ్గు చూపింది.



Click it and Unblock the Notifications