మీడియా డ్రైవ్‌లో అదరగొట్టనున్న ఫిగో ఆస్పైర్?
బుధవారం ఉదయపూర్‍లో జరగనున్న మీడియా డ్రైవ్‌లో అమెరికా ఆధారిత ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోర్డ్ తన ఫిగో ఆస్పైర్‌ను మీడియా ముందుకు తీసుకురానుంది.
నాలుగు మీటర్ల కంటే తక్కువ గల కాంపాక్ట్ సెగ్మెంట్లో ఫిగో ఆస్పైర్‌ను ఆవిష్కరించనుంది. దీని విడుదలకు సంభందించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

ఈ కారు భారత మార్కెట్లోకి విడుదలైతే స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, హూందాయ్ ఎక్సెంట్, టాటా జస్ట్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
ఈ మీడియా డ్రైవ్‌లో డ్రైవ్‌స్పార్క్ ఛీఫ్ ఎడిటర్ జోబో కురువిల్ల కూడా పాల్గొననున్నారు. ఈ మీడియా డ్రైవ్‌లో ఫిగో ఆస్పైర్ ఎంత వరకు తన సత్తాను చాటనుందో వేచి చూడాల్సిందే మరి.......
మరిన్ని విషయాలకు చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్........


Click it and Unblock the Notifications








