పూనేలో ఫోర్డ్ మస్టాంగ్ జీటీ టెస్టింగ్
ఫోర్డ్ భారత మార్కెట్లో నినాదంగా పేరు సంపాదించుకుంటోంది. తన ఎకో స్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవిని విజయాల ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
దీని గురించిన మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.......

ఈ అమెరికన్ ఆధారిత కార్ తయారీ సంస్థ ఇటీవల తన సరికొత్త అప్‌టుడేట్ మస్టాంగ్ జీటీ మోడల్‌ను ఆవిష్కరించింది.

అనంతరం రైట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఫోర్డ్ వెల్లడించింది.

ఈ వాహనాన్ని ఆర్‌హెచ్‌డీ వాహనాల్లో చేర్చింది. అంటే ప్రపంచం మొత్తం విడుదల చేసే వాహనాల జాబితా అన్న మాట.

తన ఫ్లాగ్ షిప్ మోడల్‌ను భారత్‌కు తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు చివరిగా పూనేలోని ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) లో ఫోర్డ్ మస్టాంగ్ జీటీ టెస్టింగ్ జరుగుతోంది.

దీని ప్రకారం చూస్తే మొదట భారత్‌లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫోర్డ్ మస్టాంగ్ జీటీ స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 5.8 లీ, వి8, పెట్రోల్.
హార్స్‌పవర్ : 435.
టార్క్ : 524 ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 6-స్పీడ్, ఆటోమేటిక్.

భారత్‌లో దీన్ని విడుదల చేస్తే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ రూట్ ద్వారా ఇది రానుంది.

ఇది భారత మార్కెట్ నుంచి అందించనున్న దిగ్గజ మోడల్. ఫోర్డ్ మస్టాంగ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications








