ఫ్యూచర్ ఫెరారీ ఎఫ్1 రేస్ కార్ కాన్సెప్ట్
ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ కంపెనీ ఫెరారీ తయారు చేసే ఫార్ములా వన్ (ఎఫ్1) రేస్ కార్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తరతరాలు రేస్ కార్లు రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. ట్రాక్‌పై అత్యంత వేగంగా పరుగులు తీసే ఫెరారీ ఎఫ్1 కార్ల అందానికి, అవి చేసే శబ్ధానికి ఫిదా అవని వారెవరూ ఉండరు.
ఫెరారీ తాజాగా భవిష్యత్తులో ఫార్ములా వన్ కార్లు ఇలా ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతో ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును డిజైన్ చేసింది. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నదే ఫ్యూచర్ ఫెరారీ ఎఫ్1 రేస్ కార్ కాన్సెప్ట్. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే, కానీ ఫెరారీ ఊహ నిజమైతే భవిష్యత్తులో ఫార్ములా వన్ కార్లు ఇంత సుందరంగా కనిపిస్తాయన్నమాట.

"ఎఫ్1 కారు అంటే సాంకేతికపరంగా అధునాతనమైనదే కాకుండా, తొలిచూపులోనే కళ్లకు ఆకట్టుకునే విధంగా ఉండాలి? మరి ప్రస్తుత సాంకేతిక నిబంధనలను అధిగమించి దీనిని తయారు చేయటం సాధ్యమవుతుందా? కానీ ఫెరారీలో మేము ఇది సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నాం" అని ఫెరారీ పేర్కొంది.
ఇందులో భాగంగానే.. స్కుడెరియా ఏరో డిపార్ట్‌మెంట్‌తో కలిసి తమ డిజైన్ స్టూడియో (సెంట్రో స్టైల్ ఫెరారీ) డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఎఫ్1 కారును పరిచయం చేస్తున్నామని ఫెరారీ తెలిపింది. అత్యంత సుందరంగా కనిపించే రేస్ కారును సృష్టించాలనేది తమ ముందున్న సవాల్ అని ఫెరారీ తమ ప్రకటనలో తెలిపింది. మరి ఈ అందమైన ఫెరారీ ఎఫ్1 రేస్ కార్ కాన్సెప్ట్ మీకు కూడా నచ్చిందా..?



Click it and Unblock the Notifications








