2015 జెనీవా మోటార్ షో: రియర్ మౌంటెడ్ వీల్ లేని ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ అందిస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ తాజాగా ఓ కొత్త వేరియంట్‌ను జెనీవాలో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది. 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్' (Ford EcoSport S) పేరిట కంపెనీ ప్రదర్శించిన ఈ వేరియంట్‌లో రియర్ డోర్‌కు స్పేర్ వీల్ ఉండదు.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌లో వెనుక డోరుకు స్పేర్ వీల్‌నే కాకుండా, ఎస్‌యూవీ పైభాగంలో రూఫ్ రెయిల్స్‌ని కూడా తొలగించారు. అయితే, ఈ కొత్త వేరియంట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని మెరుగు పరచి, మరింత సిటీ ఓరియెంటెడ్ కారుగా మార్చారు. ఇది సరికొత్త పెయింట్ స్కీమ్‌తో ఈ ఏడాది చివరి నాటికి లభ్యం కానుంది.

ఈ కొత్త వేరియంట్‌లో రూఫ్, సైడ్ మిర్రర్స్ షైనింగ్ బ్లాక్ ఫినిష్‌లో పెయింట్ చేశారు. ఇందులో 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఇవి గ్లాసీ బ్లాక్ ఫినిష్‌లో పెయింట్ చేయబడి ఉంటాయి. ఇంకా ఇందులో స్పోర్టీ రియర్ డిఫ్యూజర్, స్కఫ్ ప్లేట్స్ ఉంటాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్ ఫీచర్లు:
- పార్షియల్ లెథర్ సీట్స్
- చార్కోల్ బ్లాక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, సెంటర్ కన్సోల్ అండ్ డోర్ ప్యానెల్స్
- బ్యాక్‌లైట్ డిమ్మింగ్ ఫర్ ఇన్‌స్ట్రుమెంట్స్
- 4-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- క్రోమ్ పవర్ విండో స్విచెస్
- ఎయిర్ వెంట్స్ చుట్టూ క్రోమ్ గార్నిష్
- ప్రైవసీ గ్లాస్
- స్పేర్ వీల్ లేదా టైర్ మొబిలిటీ కిట్
- రీపొజిషన్డ్ హ్యాండ్‌బ్రేక్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇప్పటికే యూరప్ మార్కెట్లో మంచి పాపులారిటీని దక్కించుకుందని, ఫ్లెక్సిబల్, స్టైలిష్, ఎకనామికల్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కోరుకునే వారికి ఇదొక చక్కటి ఆప్షన్ అని ఫోర్డ్ యూరప్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ జో బకజ్ తెలిపారు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్ వేరియంట్‌లో చేసిన ఎన్‌హాన్స్‌మెంట్స్ వలన ఈ మోడల్‌కు మరింత మంచి స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








