సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం జర్మనీ ఆటోబాన్‌పై ప్రత్యేక రోడ్డు

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన రహదారులలో ఒకటైన జర్మనీలోని ఆటోబాన్ రోడ్డును, ఆ దేశ ప్రభుత్వం అధునాతన కార్ టెక్నాలజీ కోసం ఓ టెస్ట్ ఫీల్డ్‌గా మార్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అనేక కార్ కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ (డ్రైవర్‌లెస్/అటానమస్) కార్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, అలాంటి కార్లను టెస్ట్ చేసేందుకు బవేరియాలోని ఏ9 ఆటోబాన్‌లో కొంత భాగాన్ని టెస్ట్ ఫీల్డ్‌గా మార్చాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది.

'డిజిటేల్స్ టెస్ట్‌ఫీల్డ్ ఆటోబాన్' ప్రాజెక్ట్ పేరుతో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ టెస్ట్ ట్రాక్‌ను ప్రారంభించనున్నారు. డ్రైవర్ రహిత కార్ల పరీక్ష కోసం ఏర్పాటు చేస్తున్న ఈ టెస్ట్ ట్రాక్‌పై తిరిగి కార్లు ఒక కారుతో మరొక కారు సంప్రదింపులు చేసుకునేందుకు వీలుగా, ట్రాఫిక్‌పై అవసరమైన డేటాను సేకరించేందుకు వీలుగా రోడ్డుపై కొన్ని సెన్సార్లతో కూడిన మౌళిక సదుపాయాలను కూడా ఈ ట్రాక్‌పై ఏర్పాటు చేయనున్నారు.

Autobahn

ప్రస్తుతం అందుబాటులో అసిస్టెడ్ డ్రైవింగ్ టెక్నాలజీ కార్లు, అలాగే భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఫుల్లీ ఆటోమేటెడ్ కార్లను ఈ ట్రాక్‌పై పరీక్షిస్తారు. యూరప్‌లో కెల్లా అత్యధిక మొత్తం కార్లను ఉత్పత్తి చేసే దేశమైన జర్మనీ, రోబోటిక్ కార్ టెక్నాలజీ విషయంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలపై ఆధార పడకుండా, తామే స్వయంగా టెక్నాలజీని కలిగి ఉండాలని భావిస్తోంది.

ప్రత్యేకించి తమ దేశీయ తయారీదారులు గూగుల్‌పై ఆధారపడరని ఆ దేశ రవాణా మంత్రి వ్యాఖ్యానించారు. గూగుల్ కూడా ఇప్పటికే తమ సెల్ఫ్ డ్రైవింగ్ కారును అభివృద్ధి చేసి, ఆ కారును రియల్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. భవిష్యత్తులో గూగుల్ తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీని ఇతర సంస్థలకు విక్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో, జర్మనీ మాత్రం గూగుల్‌పై ఆధారపడకుండా తామే స్వయంగా ఇలాంటి టెక్నాలజీని తయారు చేసుకోవాలని భావిస్తోంది.

ఇలాంటి టెక్నాలజీ విషయంలో జర్మనీ కంపెనీలు ఇతర దేశాలకు చెందిన సంస్థలపై ఆధారపడితే, అక్కడి మార్కెట్లో ఆయా కంపెనీల మార్కెట్ వాటాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణం చేతనే జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 28, 2015, 14:34 [IST]
English summary
The German government is planning to convert part of the A9 Autobahn in Bavaria into a test-field for advanced car technology. The project is key to ensuring the country’s ‘digital sovereignty,’ according to its transport minister.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+