టాటా నానో కారుపై రూ.60,000 విలువైన బెనిఫిట్స్!
టాటా మోటార్స్ అందిస్తున్న పవర్ స్టీరింగ్ వెర్షన్ టాటా నానో ట్విస్ట్ మోడల్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ కొత్త సంవత్సర కానుకగా కంపెనీ ఈ మోడల్‌పై రూ.41,000 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది.
అలాగే, టాటా నానోలో ఆఫర్ చేస్తున్న సిఎన్‌జి వెర్షన్ ఈమ్యాక్స్ మోడల్‌పై కూడా కంపెనీ రూ.41,000 విలువైన ప్రయోజనాలను ప్రకటించింది. ఈ జనవరి నెలలో టాటా నానో కారును కొనుగోలు చేసే కస్టమర్లు మొత్తంగా సుమారు రూ.60,000 వరకూ విలువైన బెనిఫిట్లను పొందవచ్చు (ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, లాయల్టీ/వెల్‌కమ్ బోనస్‌లు కలిసి ఉంటాయి). ఈ ఆఫర్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత టాటా డీలరును సంప్రదించండి.

టాటా నానో ట్విస్ట్ ఫీచర్లు:
- యాక్టివ్ రిటర్న్ పవర్ స్టీరింగ్
- ఫ్రంట్ పవర్ విండోస్
- రిమోట్ కీలెస్ ఎంట్రీ
- డామ్సన్ పర్పల్ కలర్
- అల్లాయ్ వీల్స్
యాక్టివ్ రిటర్న్ పవర్ స్టీరింగ్
టాటా నానో ట్విస్ట్‌లో ఉపయోగించిన పవర్ స్టీరింగ్‌ను బోష్ సహకారంతో జర్మన్ సంస్థ జెడ్ఎఫ్ ప్రత్యేకంగా నానో కారు కోసం తయారు చేసింది. ఈ పవర్ స్టీరింగ్‌లో బ్రష్‌లెస్ మోటార్‌ను ఉపయోగించారు, ఇది యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్‌తో లభిస్తుంది. ఈ యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్ వలన కారును టర్న్ చేసిన తర్వాత స్టీరింగ్ ఆటోమేటిక్‌గా సెంటర్ పొజిషన్‌కు వస్తుంది. ఓ ఎంట్రీ లెవల్ కారులో ఈ ఫీచర్‌ను ఆఫర్ చేయటం ఇదే మొట్టమొదటిసారి.
ఇంజన్, మైలేజ్
టాటా నానో ట్విస్ట్ 624సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








