2015 జెనీవా మోటార్ షో: విద్యుత్ ఉత్పత్తి చేసే టైర్లు

By Ravi

ఆటోమొబైల్ రంగంలో సాంకేతికత నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకించి టైర్ల విభాగంలో కూడా సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. గాలి నింపాల్సిన అవసరం లేని నాన్-న్యుమాటిక్ టైర్ల గురించి మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం.

కాగా.. ఇప్పుడు విద్యుత్‌ని ఉత్పత్తి చేసే టైర్లను తయారు చేసింగి గుడ్ఇయర్ అనే టైర్ల తయారీ సంస్థ. గుడ్ఇయర్ బిహెచ్03 అనే పేరుతో తయారు చేసిన ఈ కొత్త రకం టైర్లు, రోడ్డుతో రాపిడి (ఫ్రిక్షన్) వలన కలిగే వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చడంలో సహకరిస్తాయి.

goodyear tyre at geneva motor show

ఇలా మారిన విద్యుచ్ఛక్తి కారులోని బ్యాటరీలను చార్జ్ చేయటానికి ఉపయోగపడుతుంది. పరిమిత బ్యాటరీ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలకు ఇదొక చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. జెనీవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షోలో గుడ్ఇయర్ ఈ సరికొత్త టైర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచింది.

బిహెచ్03 కాన్సెప్ట్ టైరుతో పాటుగా గుడ్ఇయర్ మూడు ట్యూబ్‌లతో కూడిన ఓ టైరును కూడా ప్రదర్శనకు ఉంచింది. ఇందులోని మూడు ట్యూబ్‌లు రోడ్డు పరిస్థితులను బట్టి టైరులో గాలి పీడనాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటాయి.

goodyear tyre produce electric

రోడ్డు పరిస్థితులను బట్టి ఈ త్రీ ట్యూబ్ టైర్ మూడు విభిన్న పొజిషన్లను కలిగి ఉంటుంది. అవి:

  • ఈకో/సేఫ్టీ పొజిషన్: మూడు ట్యూబ్‌లలో గరిష్ట వాయు పీడనం, రోలింగ్ సామర్థ్యం పెరుగుతుంది.
  • స్పోర్టీ పొజిషన్: ఇన్‌బోర్డ్ షోల్డర్ ట్యూబ్‌లో వాయు పీడనం తగ్గి, డ్రైవర్లకు డ్రై హ్యాండ్లింగ్ ఫీల్‌నిస్తుంది.
  • వెట్ ట్రాక్షన్ పొజిషన్: సెంటర్ ట్యూబ్‌లో గరిష్ట వాయు పీడనం ఉండి, తడిరోడ్లపై మంచి గ్రిప్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 9, 2015, 10:39 [IST]
English summary
Goodyear, the tyre manufacturer has come up with a new tyre, which could possibly be a solution to limited battery capacity of electric vehicles-a tyre that can generate electricity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+