జాతీయ రహదారులపై 125 టోల్ ప్లాజాల తొలగింపు: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే, టోల్ గేట్ల బాదుడు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి నెలాఖరు నాటికి దేశంలో పలు జాతీయ రహదారులపై సుమారు 125 టోల్ ప్లాజాలను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ విషయంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నాటికి కొన్ని హైవేలపై 125 టోల్ ప్లాజాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు 65 రోడ్ ప్రాజెక్టుల వద్ద టోల్ కలెక్షన్ నిలిపివేసినట్లు కూడా ఆయన తెలిపారు.

ఇప్పటికే సుమారు రూ.50 కోట్ల పెట్టుబడి వెచ్చించి చేపట్టిన రోడ్ ప్రాజెక్టులపై కూడా టోల్‌ను ఉచితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో పరిచయం చేసిన ఎలక్ట్రానిక్ టోల్ (ఈ-టోల్) కలెక్షన్ సిస్టమ్ వలన రూ.88,000 కోట్లు ఆదా కావటమే కాకుండా, టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం వృధా కాకుండా ఉండేందుకు సహకరిస్తోందని నితిన్ గడ్కరీ తెలిపారు.
ముంబై-ఢిల్లీ జాతీయ రహదారిపై ఉన్న 350 టోల్ పాయింట్లలో 140 టోల్ పాయింట్లను ఇప్పటికే ఈ-టోల్ పాయింట్లుగా మార్చినట్లు గడ్కరీ తెలిపారు. దేశంలో ఈ-టోల్ పని పూర్తయితే, సమారు రూ.88,000 కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








