ఏప్రిల్ నుంచి పెరగనున్న హోండా కార్ల ధరలు

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వచ్చే ఏప్రిల్ నుంచి ధరలను పెంచాలని యోచిస్తోంది. హోండా చివరి సారిగా గడచిన జనవరి నెలలో తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. కాగా.. కేవలం మూడు నెలల తర్వాతనే మళ్లీ ధరలు పెంచడం గమనార్హం.

ముడిసరుకుల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. అయితే, ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలను పెంచనున్నామనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

గడచిన ఫిబ్రవరి నుంచి ముడి సరుకుల భారం అధికమైందని, తాము సాధ్యమైనంత వరకూ ధరల భారాన్ని భరిస్తూ వచ్చామని, ఇక వేరే గత్యంతరం లేక ధరలను పెంచాలని నిర్ణయించామని హోండా అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత యూనియన్ బడ్జెట్‌లో భారత సర్కారు ఎక్సైజ్ సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. అలాగే, వాహనాలకు వర్తించే ఎడ్యుకేషన్ సెస్‌ను కూడా పెంచింది. దీంతో అమేజ్, బ్రయో మోడళ్లను అధికంగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం భారత మార్కెట్లో బ్రయో హ్యాచ్‌బ్యాక్, అమేజ్ కాంపాక్ట్ సెడాన్, సిటీ సెడాన్, మొబిలియో ఎమ్‌పివి, సిఆర్-వి ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. హోండా కార్ల ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి?

More from DriveSpark

Article Published On: Tuesday, March 24, 2015, 14:43 [IST]
English summary
Honda India has an array of product on offer in India, they had recently hiked prices of their vehicles in January, 2015. Now they are mulling a second price hike, which will go in effect by April, 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+