హోండా నుండి సరి కొత్త సివిక్ కూపె
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ అయిన హోండా తన పదవ తరం (10-జనరేషన్) కాన్సెప్ట్ కారు హోండా సివిక్ కూపె ను 2015లో జరిగిన లాస్ ఏంజిల్స్ మోటార్ షోలో ప్రదర్శించింది. దీనిని అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందించినట్లు తెలిపారు.
Also Read: గుండె మారుతి ఆల్టోది...! శరీరం ల్యాంబోర్గినిది...!!
హోండా మోటార్స్ తన కాన్సెప్ట్ వర్షన్ సివిక్ కూపె కారును 2015 న్యూ యార్క్‌లో జరగనున్న మోటార్ షోలో ప్రదర్శించనుంది. అంతే కాకుండా హోండా మోటార్స్ ఈ సివిక్ కాన్సెప్ట్ కారు ఆధారంగా మరో రెండు మోడళ్లను అభివృద్దిపరిచే పనిలో నిమగ్నం అయ్యారు. అవి - హోండా సివిక్ టైప్- ఆర్, సివిక్ యస్‌ఐ మోడల్స్
హోండా సివిక్ కూపె కాన్సెప్ట్ కారు గురించి మరింతల సమాచారం... క్రింది స్లైడర్ ద్వారా తెలుసుకుందాం.....

సరి కొత్త హోండా సివిక్ కూపే కాన్సెప్ట్ కారు విసృత శ్రేణి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

హోండా సివిక్ కూపే కారు మూడు ఇంజన్ వేరియంట్లలో లభించును.
- 1.0-లీటర్ టర్బో ఛార్జ్డ్
- 1.5-లీటర్ టర్భో ఛార్జ్డ్
- 2.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్
- 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్.
- సివిటి గేర్ బాక్స్.

అన్ని ఇంజన్ ఆప్షన్లు గల కార్లలో రెండు రకాల గేర్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సరి కొత్త హోండా సివిక్ కూపె కారు వెనుక భాగాన్ని గమనించండి. ఎంతో అందంగా ఉన్న స్పాయిలర్. అదేనండి వెనుక వైపు డిక్కి మీద ఒక పొడవాటి బార్ ఉంది కదా దానినే స్పాయిలర్ అంటారు.



Click it and Unblock the Notifications








