జాజ్, అకార్డ్ మోడళ్లను తిరిగి భారత్‌కు తీసుకురానున్న హోండా

By Ravi

గడచిన సంవత్సరంలో సరికొత్త హోండా సిటీ సెడాన్ మరియు హోండా మొబిలియో ఎమ్‌పివిలను భారత మార్కెట్‌కు పరిచయం చేసిన జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, ఈ ఏడాది కూడా రెండు కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది.

హోండా కార్స్ ఇండియా నుంచి ముందుగా రానున్న ఉత్పత్తి హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఈ సెగ్మెంట్లో నేరుగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడల్‌కి పోటీగా వస్తున్న సరికొత్త 2015 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి.

2015 Honda Jazz

ఇకపోతే.. హోండా నుంచి రానున్న రెండవ ఉత్పత్తి హోండా అకార్డ్ ప్రీమియం సెడాన్. హోండా కార్స్ ఇండియా ఈ రెండు మోడళ్లలను కొద్ది కాలం క్రితమే భారత మార్కెట్ నుంచి తొలగించింది. అయితే, వీటిలో రిఫ్రెష్డ్ వెర్షన్లు ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యాయి.

కాగా.. ఇప్పుడు ఈ రిఫ్రెష్డ్ వెర్షన్లను ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేయాలని హోండా సన్నాహాలు చేస్తోంది. సరికొత్త హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో కానున్నట్లు సమాచారం.

పెట్రోల్ వెర్షన్ హోండా జాజ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 87 బిహెచ్‌పిల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో 1.5 ఐ-డిటెక్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేయనుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

2015 Honda Accord

హోండా జాజ్ మాదిరిగానే హోండా అకార్డ్ ప్రీమియం సెడాన్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నట్లు సమాచారం. అయితే, ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. హోండా అకార్డ్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని టొయోటా క్యామ్రీ, హ్యుందాయ్ ఎలాంట్రా వంటి మోడళ్లతో తలపడనుంది.

హోండా కార్స్ ఇండియా ఈ రెండు మోడళ్లలో ఉత్పత్తి ఎక్కువ భాగాలను స్థానికంగా కొనుగోలు చేయటం (లోకలైజేషన్ శాతం పెంచడం) ద్వారా సరసమైన ధరకే వీటిని కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 5, 2015, 14:50 [IST]
English summary
Honda India had discontinued its Jazz premium hatchback and Accord premium sedan. The vehicles were believed to be overpriced and did not do well in terms of sales. They now plan to revive these two products by heavy localisation of parts and components to price it competitively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+