ఆగండి.. ఆగండి.. కొత్త హోండా సిఆర్-వి వస్తోంది!

By Ravi

జపనీస్ కార్ మేకర్ హోండా కార్స్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎస్‌యూవీ 'సిఆర్-వి' (CR-V)లో త్వరలోనే ఓ అప్‌డేటెడ్ మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే ఈ సరికొత్త 2015 హోండా సిఆర్-వి యూకే మార్కెట్లో విడుదలై మంచి పాపులరాటీని దక్కించుకుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది భారత మార్కెట్లో కూడా విడుదల కానున్నట్లు సమాచారం.

హోండా తమ అప్‌డేటెడ్ సిఆర్-వి ఎస్‌యూవీని తొలిసారిగా 2014 ప్యారిస్ మోటార్ షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శనకు ఉంచింది. కొత్త హోండా సిఆర్-విలో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

రీస్టయిల్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్ డిజైన్, కొత్త బంపర్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, స్కిడ్ గార్డ్స్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందులో గమనించవచ్చు. అలాగే, ఇంటీరియర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రత్యేకించి ఇందులో కొత్త 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేయనున్నారు. దీనిని యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు.

Honda CR V

ఈ టచ్‌స్క్రీన్ సిస్టమ్ రియర్ వ్యూ కెమెరా మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఇంకా ఇందులో ఆప్షనల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, ఇంటర్నెట్ రేడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. యూరోపియన్ వెర్షన్ మోడల్‌లో మిర్రర్ లింక్ అనే సరికొత్త టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియంగా కనిపించే డ్యాష్‌బోర్డ్, అక్కడక్కడా క్రోమ్ గార్నిష్‌తో దీని ఇంటీరియర్స్ మంచి ప్రీమియం ఫీల్‌నిస్తాయి.

ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త హోండా సిఆర్-వి ప్రస్తుత 2.0 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, ఇండియన్ మార్కెట్ కోసం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఇందులో 1.6 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 24, 2015, 14:16 [IST]
English summary
Japanese automobile giant Honda will be launching new products in India during 2015. They plan to introduce Jazz premium hatchback, HR-V compact SUV and HR-V SUV. The manufacturer had launched its first MPV for India the Mobilio, along with a new City sedan and Amaze compact sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+