హోండా కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎనీ టైమ్ వారంటీ స్కీమ్..
హోండా కార్ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ వినియోగదారుల కోసం సమయంతో సంబంధం లేని అదనపు వారంటీ స్కీమ్‌ను పరిచయం చేసింది. హోండా ఏనీ టైమ్ వారంటీ పేరుతో కంపెనీ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో భాగంగా, ప్రస్తుతం హోండా కార్లను వినియోగిస్తున్న వారు ఏ సమయంలోనైనా అదనపు వారంటీని తీసుకోవచ్చు.
సాధారణంగా హోండా కార్లు రెండేళ్ల స్టాండర్డ్ వారంటీతో లభిస్తాయి. అయితే, ఇప్పుడు కస్టమర్లు తమ కారు కొనుగోలు చేసిన తర్వాత ఈ రెండేళ్ల వారంటీ సమయం ముగిసేలోపైనా లేదా ముగిసిన తర్వాతననైనా సరే ఎనీ టైమ్ వారంటీని పొందవచ్చు. ఈ అదనపు వారంటీ ఏడేళ్లు లేదా 1,00,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) చెల్లుబాటులో ఉంటుంది.

ఒరిజినల్ వారంటీ చివరి రోజున సైతం కస్టమర్లు ఎనీ టైమ్ వారంటీ స్కీమ్‌ని పొందవచ్చు. అయితే, సదరు హోండా కారును కొనుగోలు చేసిన తర్వాత అది ఏడేళ్ల కన్నా పాతది కాకూడదు మరియు ఓడోమీటరు రీడింగ్‌పై 1,00,000 కన్నా ఎక్కువ కిలోమీటర్ల రీడింగ్ ఉండకూడదు. అంటే.. ఏడేళ్లు లేదా లక్ష కిలోమీటర్లకు పైబడిన హోండా కార్లకు మాత్రం ఈ ఎనీ టైమ్ వారంటీ వర్తించదన్నమాట.
ఒకవేళ ఎవరైనా కస్టమర్ రెండు మూడేళ్లు పాతబడిన సెకండ్ హ్యాండ్ హోండా కారును కొనుగోలు చేసినా సరే, వారు కూడా ఎనీ టైమ్ వారంటీ స్కీమ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ వారంటీలో భాగంగా రిపేరు ఖర్చులు, పార్ట్స్ రిప్లేస్‌మెంట్స్ వంటివి కవర్ అవుతాయి. ఈ అదనపు వారంటీ రేటును కార్ మోడల్‌ను బట్టి, దాని ఓవరాల్ సర్వీస్ కండిషన్‌ను ఫిక్స్ చేస్తుంది. మరింత సమాచారం కోసం మీ సమీపంలోని అధీకృత హోండా కార్స్ డీలరును సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications








