బ్రెజిల్‌లో అగ్ని పరీక్షకు సిద్దమైన హోండా జాజ్ ట్విస్ట్ క్రాసోవర్: అతి త్వరలో ఇండియాకు.
భారతీయ మార్కెట్లోకి 2015 లో వచ్చిన హోండా జాజ్ కాస్త ఫర్వాలేదనిపించింది. ఈ ఆటోమొబైల్ తయారీ సంస్థ బ్రెజిల్‌లో తమ హోండా జాజ్ ట్విస్ట్ క్రాసోవర్ కారుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
Also Read: మీ నగరంలో మీకు నచ్చిన హోండా కార్ల ధరల గురించి తెలుసుకోండి.
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న ప్రతి ఆటోమొబైల్ కంపెనీ తమ వాహన శ్రేణి నుండి క్రాసోవర్ వాహనాలను అందిస్తున్నాయి. అందులోకి ఇప్పుడు జాజ్ ట్విస్ట్ క్రాసోవర్ ద్వారా హోండా కూడా వచ్చి చేరనుంది. ఈ సరికొత్త హోండా జాజ్ ట్విస్ట్ క్రాసోవర్ గురించి మరిన్ని విశయాలు క్రింద కథనం ద్వారా తెలుసుకోగలరు.

హోండా మోటార్స్ ఈ జాజ్ ట్విస్ట్ క్రాసోవర్ కారును 2016 లో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించనుంది.

హోండా జాజ్ మోడల్‌కు మరిన్ని కొత్త సొబగులు జోడించి ఈ జాజడ్ ట్విస్ట్ క్రాసోవర్ ను సృష్టించారు. ఇందులో కొత్తగా రూఫ్ రెయిల్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పునరుద్దరించబడిన బంపర్లు, పెద్ద చక్రాలు, స్కిడ్ ప్లేట్లు ఇంకా ఎన్నో ఫీచర్లు కల్పించారు

ఈ క్రాసోవర్ కారులో జాజ్ ముందు మోడల్‌లో ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించారు. అనగా జాజ్ మరియు జాజ్ ట్విస్ట్ క్రాసోవర్ కార్ల యొక్క పని తీరు ఒకేలా ఉంటుందన్నమాట.

ఒక వేళ జాజ్ ట్విస్ట్ క్రాసోవర్ కారు మార్కెట్లోకి విడుదలైతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఐ20 క్రాస్. వోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో, టయోటా ఎటియోస్ క్రాస్, మరియు మారుతి సుజుకి యస్-క్రాస్ వంటి వాటితో గట్టి పోటిని ఎదుర్కోవలసి ఉంటుంది.

ప్రస్తుతం హోండా జాజ్ మార్కెట్లో అమ్ముడుపోతోంది. అయితే ఈ జాజ్ ట్విస్ట్ క్రాసోవర్ కారును మనం 2016 సంవత్సరం చివరి నాటికి చూడగలం.

- హోండా చిన్న కారు.. నచ్చిందా..?
- ఇండోనేషియాలో విడుదలైన హోండా బిఆర్-వి: అతి త్వరలో భారత్‌లోకి


Click it and Unblock the Notifications








