చికాగో ఆటో షోలో సరికొత్త 2015 హోండా పైలట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
జపనీస్ కార్ కంపెనీ హోండా, పూర్తిగా రీఇంజనీరింగ్ మరియు రీడిజైన్ చేసిన పైలట్ ఎస్‌యూవీని ఫిబ్రవరిలో జరగనున్న 2015 చికాగో ఆటో షోలో ఆవిష్కరించనుంది. ఈ మేరకు కంపెనీ తమ పైలట్ ఎస్‌యూవీకి సంబంధించి ఓ టీజర్ ఫొటోని కూడా విడుదల చేసింది.
ఈ కొత్త 2015 హోండా పైలట్ ఎస్‌యూవీ డిజైన్, డెవలప్‌మెంట్‌ని పూర్తిగా అమెరికాలోని చేశారు. ఎనిమిది మంది ప్యాసింజర్లు కూర్చునే విధంగా డిజైన్ చేసిన ఈ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని ఫిబ్రవరి 12వ తేది జరనున్న చికాగో ఆటో షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
కొత్త టెక్నాలజీ, అధునాత సేఫ్టీ, క్లాస్ లీడింగ్ ఫ్యూయెల్ ఎకానమీ (మైలేజ్), స్పేస్ అండ్ కంఫర్ట్ వంటి పలు అంశాల్లో హోండా పైలట్ ప్రస్తుత 3-రో (మూడు వరుసల) ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని హోండా మోటార్ కార్పోరేషన్ పేర్కొంది.

పెద్ద కుటుంబాలను టార్గెట్‌గా చేసుకొని ఈ ఎస్‌యూవీని డిజైన్ చేసినట్లు హోండా తెలిపింది. ఈ ఏడాది వేసవి నాటికి అమెరికాలోని అన్ని హోండా డీలర్‌షిప్ కేంద్రాలలో ఇది అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ 2015 చికాగో ఆటో షోలో హోండా తమ సరికొత్త పైలట్ ఎస్‌యూవీతో పాటుగా రీడిజైన్ చేయబడిన సిఆర్-వి ఎస్‌యూవీ మరియు సరికొత్త హోండా హెచ్ఆర్-వి క్రాసోవర్‍లను కూడా ప్రదర్శించనుంది. ఈ రెండు మోడళ్లు కూడా ఈ ఏడాదే మార్కెట్లోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications








