ఆటోమొబైల్ అడ్వర్టైజ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్: హ్యుందాయ్ సిక్స్త్ సెన్స్

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న జెనిసిస్ లగ్జరీ సెడాన్ ప్రచారం కోసం డిజైన్ చేసిన ఓ వీడియో ఇప్పుడు ఆటోమొబైల్ అడ్వర్టైజ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2015 డెట్రాయిట్ ఆటో షోలో ఈ అవార్డును ప్రకటించారు. ఈ కారులో ఉండే సేఫ్టీ ఫీచర్లను ప్రమోట్ చేస్తూ డిజైన్ చేసిన ఈ వీడియో కస్టమర్లను ఆలోచింపజేసేలా ఉంటుంది.

సిక్స్త్ సెన్స్ కాన్సెప్ట్‌తో ఈ వీడియోని డిజైన్ చేశారు. ఈ వీడియోలో ఓ తండ్రి చిన్నప్పటి నుంచి తన తనయుడిని కంటికి రెప్పలా, జరగబోయే ప్రమాదాల నుంచి కాపాడుకుంటూ వస్తాడు. ఆ కుమారుడికి యుక్త వయస్సు రాగానే కారు కొనిచ్చినప్పుడు, ఆ తండ్రి బాధ్యతను కారు తీసుకుంటుంది. ఆసక్తికరంగా ఈ 30 సెకండ్ల వీడియోని మీరు కూడా చూసేయండి.

హ్యుందాయ్ డాడ్స్ సిక్స్త్ సెన్స్ అడ్వర్టైజ్‌మెంట్ వీడియో:
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Xoz93u7WP6E?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
హ్యుందాయ్ జెనిసిస్ (Hyundai Genesis) విషయానికి వస్తే.. ఈ కారును కంపెనీ నుంచి అత్యంత పాపులర్ అయిన 'ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0' డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఇది నాలుగు విభిన్న ఇంజన్ ఆప్షన్ల (వి6, వి8 పెట్రోల్ ఇంజన్స్‌)తో 3.0లీ, 3.3లీ, 3.8లీ మరియు 5.0లీ సామర్థ్యాలతో లభిస్తుంది.

హ్యుందాయ్ జెనిసిస్ కారులో, సాధారణంగా అన్ని విలాసవంతమైన కార్లలో లభించే సేఫ్టీ ఫీచర్లకు అదనంగా ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబి), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ విత్ ఇంటిగ్రేటెడ్ హెడ్-అప్ డిస్‌ప్లే వంటి సరికొత్త సేఫ్టీ ఫీచర్లను జోడించారు. ఇంకా ఇందులో రాడార్ నియంత్రిత అడ్వాన్స్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, కొత్త ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, January 16, 2015, 16:08 [IST]
English summary
Hyundai's ‘Dad's Sixth Sense' ad was one of the winners of the prestigious Automobile Advertisement of the Year award, which was announced during the 2015 Detroit Auto Show.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+