స్మార్ట్ వాచ్‌తో హ్యుందాయ్ కారును రిమోట్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు

మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లుగా రూపాంతరం చెందినట్లుగానే.. మోడ్రన్ కార్లు స్మార్ట్ కార్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అవధులు లేకుండా అభివృద్ధి చెందుతున్న నేటి ఆధునిక ఆటోమొబైల్ టెక్నాలజీతో కార్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎంతో సులభతరం మరియు సురక్షితం అవుతోంది. తాజాగా.. కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ ఓ అధునాతన ఆటోమొబైల్ టెక్నాలజీని ఆవిష్కరించింది.

ప్రస్తుతం జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఈఎస్) 2015లో హ్యుందాయ్ తమ బ్లూ లింక్ స్మార్ట్ వాచ్ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ఈ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ వాచ్‌ల సాయంతో హ్యుందాయ్ కార్ల ఓనర్లు తమ కారును యాక్సిస్ చేసుకునే వెసలుబాటును కంపెనీ కల్పించింది. ఈ అప్లికేషన్ సాయంతో రిమోట్‌గానే కారు ఇంజన్‌ను స్టార్ చేసుకోవచ్చు.

Hyundai Android Wear App Helps Start Car Automatically

క్లౌడ్ ఆధారిత బ్లూ లింక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ అప్లికేషన్ ద్వారా రిమోట్ స్టార్ట్ మాత్రమే కాకుండా సర్వీస్ ఇన్‌ఫర్మేషన్‌ను కూడా త్వరితగతిన యాక్సిస్ చేసుకోవచ్చు. ఈ బ్లూ లింక్ స్మార్ట్ వాచ్ అప్లికేషన్ తయారీ కోసం హ్యుందాయ్ స్టేషన్ డిజిటల్ మీడియాతో చేతులు కలిపింది. వినియోగదారుల జీవనశైలిలో వేరబల్ టెక్నాలజీ మరియు బ్లూ లింక్ ఎలా ఇమిడిపోతాయో తెలిపేందుకు ఈ కొత్త యాప్‌ను డెవలప్ చేసినట్లు హ్యుందాయ్ మోటార్ అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బారీ రాట్జ్‌లాఫ్ తెలిపారు.

కారుని స్మార్ట్ వాచ్ ద్వారా కనెక్ట్ చేసుకోవటం, వాయిస్ రికగ్నైజేషన్ ద్వారా యాక్సిస్ చేయటం వంటివి కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసేవాళ్లమని, ఇప్పుడు ఈ సౌలభ్యాన్ని బ్లూ లింక్‌తో కూడిన హ్యుందాయ్ వాహనాల యజమానులకు అందించనున్నామని ఆయన చెప్పారు. ఈ అప్లికేషన్‌ను ఉపయోగించడం చాలా సులువు. రిమోట్ ఫంక్షన్లను చేసేందుకు స్మార్ట్ వాచ్ తెరను తాకటం లేదా వాయిస్ కమాండ్స్‌ను ఉపయోగించడం చేస్తే సరిపోతుంది.

హ్యుందాయ్ బ్లూ లింక్ స్మార్ట్ వాచ్ అప్లికేషన్ ద్వారా, కార్ ఓనర్లు తమ కారును రిమోట్‌గా స్టార్ట్ చేయటం, లాక్ చేయటం, డోర్లను అన్‌లాక్ చేయటం మరియు రద్దీగా ఉండే ప్రాంతంలో తాము కారు ఎక్కడుందో గుర్తించడం వంటివి చేయవచ్చు. ఈ అప్లికేషన్ పనితీరును చూపించే వీడియోని మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rjrhs4APld4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, January 5, 2015, 16:33 [IST]
English summary
Starting early in 2015 Hyundai car owners will be able to connect with their cars using smart watches and the Hyundai Blue Link smartwatch app. Hyundai will debut and demonstrate the Blue Link smartwatch app at Pepcom's Digital Experience and at the Consumer Electronics Show (CES). &#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+