కేవలం ఐదు నెలల కాలంలో 75,000 బుకింగ్స్ నమోదు చేసుకున్న హ్యుందాయ్ క్రెటా

By Anil

భారతీయ మార్కెట్లోని కార్ల తయారీదారులలో మారుతి సుజుకి తరువాత ఎక్కువ మంది జపిస్తున్నది హ్యుందాయ్ మోటార్స్. ఇది అక్షరాల నిజమనే చెప్పాలి. ఎందుకంటే వీరి ఉత్పత్తులు ఏ మాత్రం వెనుకబడకుండా విడుదల చేసిన ప్రతి మోడల్ కూడా మార్కెట్లో విశేష ఆదరణ పొందుతోంది.
Also Read: సరి కొత్త మార్పులతో రానున్న హ్యుందాయ్ క్రెటా

సరిగ్గా ఐదు నెలల క్రితం హ్యుందాయ్ మోటార్స్ వారు విడుదల చేసిన క్రెటా కారు అసాధారణమైన ప్రజాదరణను పొందుతోంది. ఇందుకు నిదర్శనం వీటి బుకింగ్స్. గత ఐదు నెలల కాలంలోనే దాదాపుగా 75,000 వరకు క్రెటా కార్లను బుక్ చేసుకున్నారు.
Also Read: హ్యుందాయ్ మోటార్స్ వారి ఆకర్షణీయమైన డిసెంబర్ ఆఫర్లు.

ప్రస్తుతం క్రెటా కార్లకు దేశీయంగా భారీ డిమాండ్ కలదు. భారత్‌లోనే కాకుండా వీటిని బ్రెజిల్, చైనా మరియు రష్యా దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. మొత్తం అమ్మకాలలో వీటిని ఎగుమతి చేస్తున్న వాటా దాదాపుగా 14 శాతం గా నమోదు అయ్యింది.
Also Read: మీ జన్మ నక్షత్రానికి తగిన కారు ఏదో తెలుసా ?

హ్యుందాయ్ మోటార్స్ వారు ఈ క్రెటా కార్లను డీజల్ మరియు పెట్రోల్ వేరియంట్లలో అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా గల డీజల్ యస్‌యువి కార్లలో ఆటోమేటిక్ ఆప్షన్‌ను కల్పించిన మొదటి మోడల్ కూడా ఇదే. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా వారు కూడా ఇప్పుడు తమ ఎక్స్‌యూవీ5OO వాహనంలో ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందించారు.
Also Read: ఫేస్ బుక్ వేదిక మీద ఎక్కువ మంది చదివిన డ్రైవ్ స్పార్క్ కథనాలు.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

More from DriveSpark

Article Published On: Monday, December 28, 2015, 18:12 [IST]
English summary
Hyundai Creta Registers 75,000 Bookings In India Within 5 Months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+