ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుపొందిన హ్యుందాయ్ క్రెటా

By Anil

భారత్‌లో హ్యుందాయ్ మోటార్స్ వరుసగా మూడవ సంవత్సరం కూడా ఇండియన్ కార్ ఆఫ్ ది ఆవార్డ్ ను గెలుచుకుందని హ్యుందాయ్ మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 2016 సంవత్సరానికి గాను హ్యుందాయ్ మోటార్స్ కు చెందిన క్రెటా మోడల్ ను ఇండియాన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) ఆవార్డుకు ఎంపిక చేశారు.

వరుసగా మూడవ సారి కూడా ఈ అవార్డుకు హ్యుందాయ్‌కు చెందిన కారు ఎంపిక కావడం పట్ల హ్యుందాయ్ మోటార్స్ వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డును గెలుపొందిన క్రెటా గురించి మరియు ఈ అవార్డు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

2014 లో

2014 లో

2014 లో నిర్వహించిన ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అప్పట్లో హ్యుందాయ్ కు చెందిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎంపిక కావడం జరిగింది.

2015 లో

2015 లో

2015 సంవత్సరానికి హ్యుందాయ్ వారి మరొక కారు ఎలైట్ ఐ20 కారు ఈ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది.

2016

2016

వరుసగా మూడవ సారి హ్యుందాయ్ వారి కారు ఇండియన్ కార్ అఫ్ ది అవార్డుకు ఎంపిక అయ్యింది. హ్యుందాయ్ వారు కొన్ని నెలల క్రింత విడుదల చేసిన క్రెటా కాంపాక్ట్ యస్‌యువి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం జరిగింది.

బుకింగ్స్

బుకింగ్స్

ఈ క్రెటా కారును జూలై 2015 న విడుదల చేశారు అప్పటి నుండి దాదాపుగా 74,000 బుకింగ్స్‌ను నమోదు చేసుకుని రికార్డ్‌ను నెలకొల్పింది.

14 మంది ద్వారా ఎంపిక

14 మంది ద్వారా ఎంపిక

ఈ ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కారును ఎంపిక చేయడం కోసం 14 మంది తో కూడిన బోర్డు ఉంటుంది. వీరందరు కలిసి అనేక నిర్ణయాల తరువాత ఒక కారును ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుంది.

సిఇవో మాటల్లో

సిఇవో మాటల్లో

వరుసగా మూడవ సంవత్సరం కూడా భారత్‌లో హ్యుందాయ్ కి చెందిన కారు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని హ్యుందాయ్ మోటార్స్ యమ్‌డి మరియు సిఇవో వై కె కూ తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్ రాకేష్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.

 క్రెటా ప్రత్యేకత

క్రెటా ప్రత్యేకత

క్రెటా కాంపాక్ట్ యస్‌యువి లో ఆప్షనల్ గా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌ను కలిగి ఉండటం. భారతీయ మార్కెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కలగిన ఏకైక డీజల్ కారు ఇదే కావడం దీనికి కలిసొచ్చిందని చెప్పవచ్చు.

హ్యుందాయ్ క్రెటా
  1. భారతీయ మార్కెట్లో విప్లవం సృష్టిస్తున్న టాటా "జికా": ఫస్ట్ డ్రైవ్ వివరాలు
  2. టాటా సఫారి స్ట్రామ్ వారికర్ 400 వియక్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యువి5OO
  3. భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ క్రెటా

Most Read Articles

English summary
Hyundai Motors is proud to announce that they have won the Indian Car Of The Year (ICOTY) award for the third year in a row.
Story first published: Saturday, December 19, 2015, 16:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X