హ్యుందాయ్ ఐ20 స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర మరియు ఫీచర్స్
హ్యుందాయ్ మోటార్స్ ఐ20 మోడల్ ద్వారా ఎంతో మంచి పేరును పొందింది. మరియు అత్యధిక అమ్మకాలు కూడా సాగించింది. ఐ20 ఎన్నో ప్రసంశలు గెలుచుకుంది. హ్యుందాయ్ మోటార్స్ ఈ సంవత్సరం అత్యధిక అమ్మకాలు సాధించింది అంటో దానికి కారణం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడల్.
అయితో హ్యుందాయ్ మోటార్స్ ఇంతటి దీనిని వదిలేయలేదు ఈ మోడల్‌కు కొనసాగిపుగా ఇప్పుడు ఐ20 స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఐ20 గురించి మరింత సమాచారం క్రింది స్లయిడర్ ద్వారా తెలుసుకుందాం.

అవార్డు:
మీకు తెలుసా హ్యుందాయ్ ఐ20 కారు 2015 సంవత్సరానికి గాను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందింది. మరి దీనికి కొనసాగింపుగా ఐ20 స్పెషల్ ఎడిషన్ కారును విడుదల చేశారు. ఇది కూడా ఐ20 లా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నారు.

వేరియంట్స్:
ఈ స్పెషల్ ఎడిషన్ కారును స్పోర్ట్జ్ ట్రిమ్ మోడల్లో మాత్రమే అందిస్తున్నారు. ఇందులో రెండు వేరియంట్లను అందుబాటులో ఉన్నాయి అవి పెట్రోల్ వేరియంట్ మరియు డీజల్ స్పెషల్ ఎడిషన్.

ధర :
- ఐ20 లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.69 లక్షలు ఎక్స్-షోరూమ్, డిల్లీ.
- ఐ20 లిమిటెడ్ ఎడిషన్ డీజల్ వేరియంట్ ధర రూ. 7.84 లక్షలు ఎక్స్-షోరూమ్, డిల్లీ.

స్పెసిఫికేషన్స్ :
పోలార్ వైట్ కలర్ గల బాడి గ్రాఫిక్ డిజైన్స్ తో తయారైనది. మరియు ఇందులో 16-ఇంచుల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం పెడల్స్, ఐ20 ప్రత్యేకతను చాటడానికి అదనపు అలంకారాలను జోడించారు.

ఇంజన్:
మెకానికల్ ఐ20 కి మరియు ఐ20 స్పెషల్ ఎడిషన్‌కు మద్య ఎటువంటి వ్యత్యాసం లేదు. పెట్రోల్ వేరియంట్‌లో ఉన్న 1.2-లీటర్ కప్పా విటివిటి యూనిట్ 83 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.4-లీటర్ యు2 సిఆర్‌డిఐ డీజల్ యూనిట్ 89 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








