2016 ఐ20 ర్యాలి కారును విడుదల చేసిన హ్యుందాయ్ మోటార్స్
హ్యుందాయ్ మోటార్స్ 2016 సంవత్సరానికి గాను ప్రపంచ ర్యాసి ఛాంపియన్ కోసం తమ ఐ20 కారును ర్యాలి ఎడిషన్‌లో పరిచయం చేసింది. కొత్త తరం ర్యాలి కారును హ్యుందాయ్ టీమ్ తమ ప్రధాన కార్యాలయం అయిన జర్మనీలో ప్రవేశ పెట్టింది.
Also Read: 20 నెలల్లో.. 1.5 లక్షల ఎలైట్ ఐ20 కార్లను అమ్మిన హ్యూందాయ్
ఈ వరల్డ్ ర్యాలి ఛాంపియన్ ఐ20 కారు ఐదు డోర్లు గల ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో రూపొందించబడింది. ఎక్ట్సా డోర్లు దీనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. దీని ముందు వైపు గల ఫ్రంట్ గ్రిల్, ఎడ్జ్‌లు, హెడ్ లైట్ల వద్ద మొత్తం ఎంతో పదునుగా ఉండేట్లు డిజైన్ చేశారు.

ఈ ఐ20 ర్యాలి కారులో 1.6-లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 296 బిహెచ్ పవర్ మరియు 300 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మొత్తం పవర్ కారులో గల అన్ని చక్రాలకు ఇందులో గల 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్ బాక్స్ ద్వారా అందుతుంది.
Also Read: హ్యుందాయ్ మోటార్స్ వారి ఆకర్షణీయమైన డిసెంబర్ ఆఫర్లు.




Click it and Unblock the Notifications








