హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ టీజర్ విడుదల

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఇటీవలే ఎలైట్ ఐ20 అనే సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ కొత్త క్రాసోవర్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించడం జరిగింది.

ఇప్పుడు ఆ వార్తను నిజం చేస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఐ20 క్రాసోవర్ టీజర్ స్కెచ్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త హ్యుందాయ్ ఐ20 మోడల్‌ను 'ఐ20 యాక్టివ్' అని పిలువనున్నారు. ఈ కొత్త క్రాసోవర్ మోడల్‌ను జర్మనీలోని రస్సెల్స్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు.

వచ్చే నెలలో హ్యుందాయ్ తమ ఐ20 యాక్టివ్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఐ20 యాక్టివ్ ఇంజన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ప్రస్తుత ఎలైట్ ఐ20 మోడల్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఇందులోను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

hyundai i20 active india launch

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంజన్ ఆప్షన్లు:

  • పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1197సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 82 హెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 18.6 కెఎంపిఎల్.
  • డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1396సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 హెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 22.54 కెఎంపిఎల్.

ఈ టీజర్ స్కెచ్‌ను బట్టి గమనిస్తే హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మరింత ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను, ప్రొటెక్టివ్ క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది. క్రాసోవర్ లుక్ కోసం దీని బంపర్లను కూడా రీడిజైన్ చేశారు. అలాగే, ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఐ20 యాక్టివ్ ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, February 28, 2015, 15:49 [IST]
English summary
This new crossover by Hyundai has been designed at their design centre in Russelsheim, Germany. The South-Korean manufacturer has confirmed that their i20 Active will be launched in India during March, 2015, which will also mark its global debut.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+