హ్యుందాయ్ ఐ20 మోడళ్లకు భారీ డిమాండ్; ఉత్పత్తి పెంపు!
హ్యుందాయ్ నుంచి స్టన్నింగ్ లుక్‌తో వచ్చిన ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఈ మోడల్ ఉత్పత్తికి మించి డిమాండ్ ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో హ్యుందాయ్ తాజాగా విడుదల చేసిన ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌ను విడుదల చేయటంతో ఈ మోడళ్ల వెయింటింగ్ పీరియడ్ మరింత పెరగనుంది.
హ్యుందాయ్ ప్రస్తుతం ప్రతినెలా సగటున 10,000 యూనిట్లకు పైగా ఎలైట్ ఐ20 కార్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఇప్పుడు తాజాగా ఐ20 యాక్టివ్ క్రాసోవర్ మోడల్ కూడా విడుదల కావటంతో, కంపెనీ దీని ఉత్పత్తిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలైట్ ఐ20 మార్కెట్లో విడుదలైన 7 నెలల వ్యవధిలో ఇప్పటి వరకూ సుమారు లక్ష యూనిట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ విషయానికి వస్తే.. కంపెనీ అందిస్తున్న ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఈ మోడల్‌ను జర్మనీలోని రస్సెల్స్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు.
ఇంజన్ డిటేల్స్:
- పెట్రోల్ : 1197సీసీ, 82 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ చార్క్, 5-స్పీడ్ మ్యాన్యువల్
- డీజిల్ : 1396సీసీ, 89 బిహెచ్‌పి పవర్, 220 ఎన్ఎమ్ చార్క్, 6-స్పీడ్ మ్యాన్యువల్
కీలక ఫీచర్లు:
- 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్
- డ్యూయెల్-టోన్ ఇంటీరియర్స్ (ఆరెంజ్ అండ్ బ్లాక్, ఆక్వా బ్లూ అండ్ బ్లాక్)
- 190 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ (ఎలైట్ ఐ20 కన్నా 20 మి.మీ. అధికం)
- అల్యూమినియం కోటెడ్ పెడల్స్
- ఇంటీరియర్ థీమ్‌తో మ్యాచ్ అయ్యే గేర్-నాబ్
- బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్
- రూఫ్ స్పాయిలర్, రూఫ్ రెయిల్స్


Click it and Unblock the Notifications








