హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‍యూవీ చాలా సేఫ్ గురూ..

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్, ఈ ఏడాది భారత మార్కెట్లో సరికొత్త కాంపాక్ట్ సెడాన్ 'హ్యుందాయ్ ఐఎక్స్25' (Hyundai ix25)ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌ను మన కన్నా ముందుగా చైనా మార్కెట్లో విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ ఐఎక్స్25 కారు, చైనాలో క్రాష్ టెస్టును కూడా సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయ్యింది. చైనా న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (సి-ఎన్‌సిఏపి) నిర్వహించిన క్రాష్ టెస్టులో హ్యుందాయ్ ఐఎక్స్25 కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం ఐదు స్టార్లకు గాను ఐదు స్టార్ల రేటింగ్‌ను దక్కించుకుని, సురక్షితమైన కారుగా పేరు తెచ్చుకుంది.

Hyundai ix25 Frontal Crash Test

హ్యుందాయ్ ఐఎక్స్25 కారు కోసం మొత్తం నాలుగు రకాల టెస్టులు (100 పర్సెంట్ ఓవర్‌ల్యాప్ క్రాష్, సైడ్ ఇంపాక్ట్, 40 పర్సెంట్ ఓవర్‌ల్యాప్ ఫ్రంట్, విప్లాష్) నిర్వహించారు. ఈ క్రాష్ టెస్టును గంటకు 50 కిలోమీటర్ల వేగం వద్ద నిర్వహించారు.

ఫ్రంటల్ క్రాష్ టెస్టులో ఇది 18 పాయింట్లకు గాను 15.89 పాయింట్లు స్కోర్ చేయగా, సైడ్ ఇంపాక్ట్ టెస్టులో 18 పాయింట్లకు గాను మొత్తం 18 పాయింట్లు స్కోర్ చేసింది. క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించినది బేస్ వేరియంట్ ఐఎక్స్25 మోడల్. ఇందులో సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ లేవు, అయినప్పటికీ ఇది సురక్షితమైన వాహనంగా నిరూపించుకుంది.

ix25 Side Impact Test

ఇకపోతే.. 40 పర్సెంట్ ఓవర్‌ల్యాప్ క్రాష్ టెస్టును గంటకు 64 కిలోమీటర్ల వేగం వద్ద నిర్వహించారు. ఇందులో మొత్తం 18 పాయింట్లకు గాను ఐఎక్స్25 14.11 పాయింట్లు స్కోర్ చేసింది. అలాగే, విప్లాష్ టెస్టును గంటకు 15.65 కిలోమీటర్ల వేగం వద్ద నిర్వహించారు. ఇందులో ఇది ఫుల్ స్కోర్ సాధించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2015, 13:06 [IST]
English summary
China New Car Assessment Program (C-NCAP) has awarded the Hyundai ix25 five stars in terms of safety. The ix25 was recently launched in China. Four types of crash tests was conducted on the new compact SUV from the South Korean automaker, Hyundai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+