నవరాత్రి ఆఫర్‌లను పొడిగించిన హ్యుందాయ్ మోటార్స్
హ్యుందాయ్ ఇండియా నవరాత్రి ఉత్సవాలనుప పురష్కరించుకుని భారతీయులకు నవరాత్రి ఆఫర్‌లను ప్రకటించింది. అయితే ఇది ఈ దసెరా పండుగతో ముగియనుండటంతో ఈ ఆఫర్‌లను అక్టోబర్ 22 వరకు పొడిగించారు. అయితే కొన్ని ఎంపిక చేసిన మో డళ్ల మీద మాత్రమే ఈ ఆఫర్లను ప్రకటించినట్లు తెలిసింది.
Also Read: పండుగ సీజన్ ఆఫర్లును ప్రకటించిన షెవర్లే ఇండియా.
హ్యుందాయ్ మోటార్స ప్రకటించిన ఆఫర్లను మరియు డిస్కౌంట్లను తెలుసుకోవాలని ఉందా అయితే క్రింది స్లైడర్ల మీద ఓ లుక్కేయండి.

ఆఫర్‌లు అందుబాటులో ఉన్న మోడల్స్:
హ్యుందాయ్ మోటార్స్ క్రింది కార్ల మీద ఆఫర్‌లను ప్రకటించింది.
హ్యుందాయ్ సనాటా, ఎలెంట్రా, వెర్నా, జెంట్, గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20 మరియు ఇయాన్ వంటి మోడళ్ల మీద డిస్కౌండట్లు ప్రకటించింది. హ్యుందాయ్ కార్ల ధరలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం గెలుచుకునే అవకాశం:
కొనుగోలుదారులుకు దాదాపుగా ఒక లక్ష వరకు డిస్కౌంట్ల ఈ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకంగా కల్పించారు. మరియు 22 వ తేది లోపు హ్యుందాయ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి లక్ష రుపాయలు విలువ చేసే బంగారం గెలుచుకునే అవకాశం అందించారు.

హ్యుందాయ్ స్యాంటా :
హ్యుందాయ్ స్యాంటా మోడల్ కారును ఎంచుకునే వారికి దాదాపుగా లక్ష రుపాయల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు.

హ్యుందాయ్ వెర్నా:
హ్యుందాయ్ వెర్నా మీద ఎక్కువగా 83,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకిటించారు. మరియు హ్యుందాయ్ ఎలెంట్రా మీద అత్యధికంగా 90,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.

గ్రాండ్ ఐ10 మరియు జెంట్ :
హ్యుందాయ్ జెంట్ మరియు గ్రాండ్ ఐ10 మోడల్స్ మీద కంపెని దాదాపుగా 70,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ ఆఫర్‌లను పెట్రోల్ మరియు డీజల్ హ్యాచ్‌బ్యాక్ రెండింటిలోను కల్పించారు.

ఐ10 హ్యాచ్‌బ్యాక్:
హ్యుందాయ్ మోటార్స్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ లో ఉన్న పెట్రోల్ మరియు సి.యన్.జి వేరియంట్ల మీద భారతీయులకు ఆకర్షణీయంగా 50,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.


Click it and Unblock the Notifications








