5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న సరికొత్త ఫోర్డ్ ఎండీవర్
ఫోర్ట్ ఇండియా తన సరికొత్త ఎండీవర్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(యస్‌యువి) ను భారత్‌లో విడుదల చేయడానికి అన్ని సిద్దం చేసుకుంది. ఫోర్డ్ ఇప్పటికే చాలా వరకు ఎంపిక చేసిన యస్‌యువి లను మార్కెట్లో అమ్ముతోంది. అంతర్జాతీయ మార్కెట్లలలో తన సత్తా నిరూపించుకోవడానికి ఈ సరి కొత్త ఎండీవర్ కొన్ని క్రాష్ పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో భాగంగా ఆస్ట్రేలియన్ న్యు కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(ANCAP) నుండి భద్రత పరీక్షలకు సంభందించి 5-స్టార్ రేటింగ్ పొందినది.
Also Read: విజయ పథంలో దూసుకెళ్తున్న 2015 ఫోర్డ్ ఫిగొ
భద్రత పరీక్షలలో 5-స్టార్ రేటింగ్ పొందిన ఈ సరి కొత్త ఫోర్డ్ ఎండీవర్ గురించి మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయాలు క్రింద స్లైడర్ల ద్వారా అందించాము....

ఫోర్డ్ ఎండీవర్ ఇంజన్ :
సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ రెండు రకాల డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించనుంది.
- 2.2-లీటర్ డీజల్ వేరియంట్
- 3.2-లీటర్ డీజల్ వేరియంట్
- ముందు వైపున ఎయిర్ బ్యాగ్స్
- పక్క వైపున కర్టన్ ఎయిర్ బ్యాగ్స్
- డ్రైవర్ మోకాలి దగ్గర ఎయిర్ బ్యాగ్
- సీట్ బెల్ట్‌ని గుర్తు చేసే ఫీచర్
- ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్
- యాంటి-లాక్ బ్రేకిగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- టయోటా ఫర్చూనర్
- హ్యుందాయ్ స్యాంటా యఫ్ఇ
- స్యాంగ్‌యాంగ్ రెక్ట్సాన్
- మిత్సుబిషి పజోరో స్పోర్ట్ మరియు.
- షెవర్లే ట్రయల్‌బ్లేజర్
- మరిన్ని ఫోర్డ్ వాహనాల గురించి తెలుసుకోండి.
- కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ విడుదల: ధర, స్పెసిఫికేషన్స్ కోసం..
- మీ నగరంలో ఫోర్డ్ వాహనాల ధరలు తెలుసుకోండి.
ఎనిమిదవ స్లైడర్‌లో ఫోర్డ్ ఎండీవర్ క్రాష్ పరీక్షలలో పాల్గొన్న వీడియో కలదు.

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ :
ఈ రెండు ఇంజన్‌లు మ్యాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ లతో అందుబాటులోకి రానున్నాయి. మరియు ఈ రెండు ట్రాన్స్‌మిషన్‌లు డ్రైవ్‌ని ఆప్షనల్ గా వెనుక చక్రాలకు మరియు నాలుగు చక్రాలకు అందిస్తాయి.

ధర :
ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉండి స్టాండర్డ్ డీజల్ ఇంజన్ గల సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ కారును త్వరలో ఇండియాలో ఒత అంచనా ప్రకారం 25 నుండి 30 లక్షల రుపాయల మధ్య విడుదల చేసే ఆలోచనలో ఫోర్డ ఇండియా ఉంది. ఈ కాంపాక్ట్ యస్‌యువి కంప్లీట్లి బిల్ట్ యూనిట్ (సిబియు) ఆప్షన్ తో రానుంది.

భద్రత :
ప్రతి ఒక్క వాహనంలో ఉండవలసిన ముఖ్యమైన అంశం భద్రత. భద్రత పరంగా ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయి.


5-స్టార్ ANCAP రేటింగ్
ఏయన్‌సిఏపి నిర్వహించే భద్రత పరీక్షలలో ఈ సరి కొత్త ఫోర్డ ఎండీవర్ 37 కి గాను 35.38 పాయింట్లను సాధించింది. ఈ పరీక్షలలో భాగంగా గంటకు 64 కిలో మీటర్ల వేగంతో ముందు ప్రమాదాన్ని సృష్టించి 5-స్టార్ రేటింగ్ ను పొందింది.

ఫోర్డ్ యస్‌యువి :
ఈ కొత్త ఫోర్డ యస్‌యువి లో గల ల్యాడర్ ఫ్రేమ్ క్రాష్ పరీక్షలలో 16 కి గాన 15.98 పాయింట్లను ముందువైపు మరియు పక్కవైపున క్రాష్ పరీక్షల ద్వారా సాధించింది.
ఇంతవరకు క్రాష్ పరీక్షల గురించి చదవడమే చేశారు కదా! ఈ క్రాష్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో ఒక సారి పక్కనున్న వీడియోని చూడండి

పోటి :
ఈ కొత్త ఫోర్డ్ ఎండీవర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రింది మోడళ్లతో పోటి పడనుంది.



Click it and Unblock the Notifications








